వాలిస్ మాథియాస్

వాలిస్ మథియాస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1935-02-04)1935 ఫిబ్రవరి 4
కరాచీ, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1994 జూలై 1(1994-07-01) (వయసు 59)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 23)1955 నవంబరు 7 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1962 ఆగస్టు 16 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 21 146
చేసిన పరుగులు 783 7,520
బ్యాటింగు సగటు 23.72 44.49
100లు/50లు 0/3 16/41
అత్యధిక స్కోరు 77 278*
వేసిన బంతులు 24 1,090
వికెట్లు 0 13
బౌలింగు సగటు 40.92
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/4
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 130/–
మూలం: Cricinfo, 2016 జూన్ 13

వాలిస్ మథియాస్ (1935, ఫిబ్రవరి 4 - 1994, సెప్టెంబరు 1) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1955 నుండి 1962 వరకు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్తాన్ తరపున ఆడిన మొదటి ముస్లిమేతర క్రికెటర్ గా నిలిచాడు.[1]

జననం, విద్య

[మార్చు]

వాలిస్ మథియాస్ 1935, ఫిబ్రవరి 4న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు. కరాచీలోని గోవా కమ్యూనిటీకి చెందినవాడు.[2][3] జింఖానా క్లబ్‌లోని ఒక పోర్టర్ కుమారుడు.[4] కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో చదువుకున్నాడు.[5]

క్రికెట్ రంగం

[మార్చు]

మథియాస్ ఒక స్టైలిష్ కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. టెస్ట్ కెరీర్‌లో మూడు హాఫ్ సెంచరీలు (వెస్టిండీస్‌పై) చేశాడు. 1958-59లో ఢాకాలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ప్రతి ఇన్నింగ్స్‌లో 64, 45 పరుగులు చేశాడు.[6]

పాకిస్థానీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ కంబైన్డ్ స్కూల్స్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు. 1962లో ఇంగ్లాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత, తర్వాతి నాలుగు సంవత్సరాల్లో అతను 13 మ్యాచ్‌లలో 113.08 సగటుతో 1357 పరుగులు చేసాడు.[7] 1965-66లో రైల్వేస్ గ్రీన్స్‌పై కరాచీ బ్లూస్ తరపున 278 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు, ఇది అతని కెరీర్-బెస్ట్ స్కోరు.[8] నాలుగు సంవత్సరాల తరువాత అతను కొత్తగా ఏర్పడిన నేషనల్ బ్యాంక్ క్రికెట్ జట్టులో చేరి, మొట్టమొదటి కెప్టెన్ అయ్యాడు, 1976-77 వరకు ఆడాడు. తరువాత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 146 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 16 సెంచరీలు, 44.49 సగటుతో 7,520 పరుగులు చేశాడు. టెస్టుల్లో 22 క్యాచ్‌లు 130 పట్టుకున్నాడు.

మరణం

[మార్చు]

మథియాస్ తన 59 సంవత్సరాల వయస్సులో 1994, సెప్టెంబరు 1న మెదడు రక్తస్రావంతో మరణించాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. Wisden. Engel, Matthew (ed.). Wisden Cricketers' Almanack, 132nd edition (1995 ed.). London: John Wisden & Co Ltd. p. 1388.
  2. "Pakistan's Goa Connections". Times of India. 3 November 2016. Retrieved 28 April 2020.
  3. Peter Oborne (9 April 2015). Wounded Tiger: A History of Cricket in Pakistan. Simon and Schuster. p. 526. ISBN 978-1-84983-248-9.
  4. Omar Noman, Pride and Passion: An Exhilarating Half Century of Cricket in Pakistan, OUP, Karachi, 1998, p. 94.
  5. "Notable Alumni – St. Patrick's High School". Archived from the original on 31 December 2019. Retrieved 26 August 2019.
  6. "The Home of CricketArchive". cricketarchive.com.
  7. "The Home of CricketArchive". cricketarchive.com.
  8. "The Home of CricketArchive". cricketarchive.com.
  9. "Non-Muslims to play international cricket for Pakistan | Sports | thenews.com.pk". www.thenews.com.pk.

బాహ్య లింకులు

[మార్చు]