వింజమూరి సీతా దేవి | |
---|---|
వింజమూరి సీతా దేవి
| |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | అవసరాల సీతా దేవి |
జననం | 1924 మే 12 |
మరణం | 2016 మే 17 | (వయసు 92)
సంగీత రీతి | జానపద సంగీతం, లలిత సంగీతం |
వృత్తి | గాయని, రచయిత |
క్రియాశీలక సంవత్సరాలు | 1940-? |
సభ్యులు | |
వింజమూరి అనసూయ |
వింజమూరి సీతాదేవి సంగీతకారిణి, గాయకురాలు, తెలుగు ఫోక్ సంగీతంలో పండితురాలు. ఆమె ఆల్ ఇండియా రేడియోలో ఫోక్ మ్యూసిక్ లో ప్రొడ్యూసర్ గా పనిచేసారు.[1]
ఆమె కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేన కోడలు. ఆమె సోదరి కూడా ప్రసిద్ధ సంగీతకారిణి అయిన వింజమూరి అనసూయ. వీరిద్దరినీ కలసి "వింజమూరి సిస్టర్స్"గా పిలుస్తారు. 1930వ దశకంలో వాళ్ళిద్దరూ వేదికలపై సహగానం మొదలు పెట్టారు. వీరి తండ్రి పండితుడు, నాటకకర్త వింజమూరి నరసింహారావు. వీరు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పిఠాపురం ప్రాంతంవారు. అక్కచెల్లెళ్ళిద్దరూ మొదట కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తర్వాత లలిత సంగీత శైలిలో కృష్ణ శాస్త్రి గారివి, ఇతర కవులవీ భావ గీతాలు పాడుతూ ఉండేవారు. తర్వాత జానపద సంగీత పితామహుడుగా పేరొందిన వల్లూరి జగన్నాథరావు గారి వద్ద జానపద సంగీతం నేర్చుకున్నారు. ఇన్ని రకాల సంగీతాలు గానం చేసినా ఈ అక్కచెల్లెళ్ళు ప్రధానంగా జానపద సంగీత గాయనులు గానే ప్రసిద్ధికెక్కారు. ఆంధ్ర దేశంలో జానపద సంగీతానికి సభా గౌరవం సంపాదించి పెట్టిన మొదటి గాయనీమణులు వీరిద్దరే.[2]
సీతగారు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బి.ఏ. డిగ్రీ తీసుకున్న తర్వాత ‘ఆంధ్రదేశపు జానపద సంగీతం’పై పరిశోధన చేసి 1952లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.లిట్ డిగ్రీ తీసుకున్నారు. ఆ పరిశోధన సారాన్నే ఆమె ఇంగ్లీషులో ’'Folk Music of AndhraPradesh’ అనే గ్రంథంగా రచించారు. సుమారు 1960 ప్రాంతంలో ఆవిడ ఆకాశవాణిలో జానపద సంగీత నిర్వాహకురాలిగా చేరారు. పాతిక సంవత్సరాలు ఆ ఉద్యోగం చేసి 1985లో రిటైరయ్యారు.
జానపద విభాగములో ప్రొడ్యూసర్ గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసిన సీతాదేవి ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేన కోడలు. ఆమె సోదరి వింజమూరి అనసూయ. ఈ అక్క చెల్లెండ్రు ఇద్దరూ జానపద గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.[3] తన సోదరి అనసూయతో కలిసి లెక్కకుమించి ప్రదర్శనలు, రేడియో షోలు నిర్వహించారు. తెలంగాణాలో అనేక ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలకు ప్రాణం పోశారు. సీతాదేవి గాయకురాలు కూడా. జానపద గేయాలు సంకలన రూపంలో వెలువరించారు. 1984 లో సీతా దేవి పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిర పడింది. భక్తి - ముక్తి, లాలి-తాళి పేర జానపద గేయాలు ప్రచురించారు. కొంత కాలం మదరాసు కేంద్రంలో పనిచేశారు. వీరికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది.
1962 నుంచి 1684 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జానపద సంగీత ప్రయోక్తగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల జానపద గీతాలను సేకరించి, అవే బాణీలతో స్టూడియో కళాకారులతో రికార్డు చేసేవారు. సోదరి అనసూయతో కలిసి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద లలిత జానపద సంగీత ప్రదర్శనలిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్ జానపద సంగీతం' పేరుతో గ్రామ్ ఫోన్ రికార్డు లను విడుదల చేశారు.[4]
ఆమె 1979 లో విడుదలైన మన భూమి చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'బండెనక బండి కట్టి..', 'పల్లెటూరి పిల్లగాడ పసులగాసె మొనగాడ పాలు మరచి ఎన్నాళ్లయిందో.. ' లాంటి పాటలు ఇప్పటికీ జనాదరణ పొందిన పాటలు. ఆమె "ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అనే పుస్తర రచయిత.[5]
ఆమె 2016 మే 17 న అమెరికాలో చనిపోయారు.