వికీ రాబిట్ హోల్, అనేది వికీపీడియా, ఇతర వికీలను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నావిగేట్ చేయడం ద్వారా పాఠకుడిని ఒక టాపిక్ నుండి మరొక టాపిక్ కు తీసుకువెళ్ళే విధానం. దీనికి వికీ కాల రంధ్రం,[1]వికీహోల్[2] అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ హోల్ అనే పదం ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ నుండి వచ్చింది. దీనిలో ఆలిస్ తెల్ల కుందేలును తన బొరియలోకి అనుసరించడం ద్వారా ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాడు.
ఏదైనా ఒక వీడియోను కానీ, ఒక సమాచారాన్ని కానీ చూసినప్పుడు, చాలామంది ప్రజలు తాము చూసిన దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వికీపీడియాకు వస్తారు. వికీలోకి వారు వచ్చిన తరువాత ఆ వ్యాసం నుండి మరిన్ని వ్యాసాలు చూడడంకోసం వికీ రాబిట్ హోల్ విధానంలోకి వెళతారు.[3] చారిత్రక వ్యక్తుల ఆధారంగా వచ్చిన సినిమాలు, సంఘటనలు వికీపీడియా రాబిట్ హోల్ విధానంలో వెతకడానికి పాఠకులకు ఉపయోగపడుతాయి.[4]
వికీపీడియా వ్యాసాల మధ్య సంబంధాలను చూపించే డేటా విజువలైజేషన్లు వంటివి పాఠకులు ఒక టాపిక్ నుండి మరో టాపిక్ వరకు నావిగేట్ చేయడానికి తీసుకోగల మార్గాలను సూచిస్తాయి.[5]
వికీమీడియా ఫౌండేషన్ సంస్థ, పాఠకులు ఈ రాబిట్ హోల్ విధానంలోకి ఎలా ప్రవేశిస్తారనే దానిపై పరిశోధనలను కూడా ప్రచురిస్తోంది.[6] ఈ రాబిట్ హోల్ బ్రౌజింగ్ ప్రక్రియ వికీపీడియాలోని వివిధ భాషలలో జరుగుతోంది.[7]
ఈ రాబిట్ హోల్ గురించి పాఠకులు తమ అనుభవాలను వికీపీడియా వేడుకలతోపాటు సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు.[8][9] కొంతమందికి ఈ రాబిట్ హోల్ విధానం నచ్చడంతో, సరదా కోసం కూడా వికీపీడియాకు వెళతారు.[10][11] రాబిట్ హోల్ విధానంలో వెతకడం అనేది వికీరాసింగ్‌లో భాగంగా ఉంది.[12]