ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వికీప్రాజెక్ట్, నిర్దిష్ట సవరణ లక్ష్యాలను సాధించడానికి లేదా నిర్దిష్ట జ్ఞాన రంగానికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేయబడిన వికీ సమూహం. వికీప్రాజెక్ట్‌లు వికీపీడియాలో ఎక్కువగా ఇతర విక్షనరీ, వికీకోట్, వికీడేటా, వికీసోర్స్ వంటి సోదర ప్రాజెక్ట్‌లలో తక్కువగా ఉన్నాయి. వికీపీడియాకు బయట ప్రాజెక్టులు కూడా ఈ పదాన్ని వాడతాయి (ఉదాహరణకు OpenStreetMap ) .[1] COVID-19 మహమ్మారి సమయంలో, వ్యాధికి సంబంధించిన కథనాల కచ్చితత్వాన్ని నిర్వహించడంలో వికీపీడియా వికీప్రాజెక్ట్ మెడిసిన్ పాత్రను సిబిఎస్ న్యూస్ గుర్తించింది.[2] వికీప్రాజెక్ట్ మహిళా శాస్త్రవేత్తలు ప్రాజెక్టు, "వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్యను దాదాపు 1,600 నుండి 5,000కి పెంచడంలో సహాయపడిందని" స్మిత్సోనియన్ మ్యాగజైన్ పేర్కొంది.[3]
కొన్ని వికీపీడియా వికీప్రాజెక్ట్‌లు ఏదైనా రంగానికి సంబంధించిన బయటి సంస్థలతో సహకార కార్యకలాపాలలో పాల్గొనడానికి తగినంత స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు, 2014లో కొక్రాన్ కొల్లాబరేషన్(Cochrane Collaboration) "వికీపీడియా ఆరోగ్య సంబంధిత వ్యాసాలను తాజాగా, నిష్పక్షపాతంగా అధిక నాణ్యతతో వుంచడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి. కోక్రాన్ నివేదికలను పంచుకోడానికి తోడ్పడటానికి." ఆంగ్ల వికీపీడియా వికీప్రాజెక్టు మెడిసిన్ (WikiProject Medicine) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.[4]
తెలుగు వికీపీడియా పదుల సంఖ్యలో ప్రాథమికంగా నిర్దిష్ట జ్ఞాన అంశాల గురించి, నిర్దిష్ట నిర్వహణ పనులను కోసం వికీప్రాజెక్ట్‌లను కలిగి ఉంది [5][6] ఆంగ్ల వికీపీడియాలో సాధారణంగా నిర్వహించే ప్రాజెక్టు 'ఒక విషయం పరిధిలోకి వచ్చే వ్యాసాల నాణ్యతను అంచనా వేయడం' కాగా తెలుగువికీపీడియాలో సముదాయం బలహీనంగా వుండడంతో ఇటువంటివి విరివిగా జరగలేదు. వికీపీడియా, సోదరి ప్రాజెక్టులలో, వికీప్రాజెక్ట్ పేజీలు ప్రాజెక్ట్ పేరుబరిలో ఉన్నాయి.[5] వ్యాసం, వికీప్రాజెక్ట్ ల మధ్య అనుబంధానికి సంబంధించిన మెటా సమాచారం సాధారణంగా వ్యాసం చర్చా పేజీలో చేర్చబడుతుంది.[7] వికీప్రాజెక్ట్‌లు సారూప్య ఆసక్తులు కలిగిన సంపాదకుల మధ్య సహకారానికి అదనపు మార్గాన్ని అందించటం ద్వారా ఉత్పాదకతను పెంచుతాయి.[8] భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రభావశీలతను కేంద్రీకరించడానికి, "ఈ వారం సహకారం",[9] లేదా వ్యాసాన్ని "ప్రదర్శన" స్థితిని సాధించే స్థాయికి మెరుగుపరచే చర్యలకు వికీపీడియాలోని వికీప్రాజెక్ట్‌లు అదనపు దారిగా ఉన్నాయి.[10] వికీప్రాజెక్ట్ కౌన్సిల్ అనేది క్రియాశీల వికీప్రాజెక్ట్‌ల అభివృద్ధికి సహాయపడే సంపాదకుల సమూహం,, అంతర్-వికీప్రాజెక్ట్ చర్చ, సహకారానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది.
వికీప్రాజెక్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఎడిటర్ అడ్మినిస్ట్రేటర్ అయ్యే అవకాశాలను గణనీయంగా మెరుగుపరిచిందని, ఒక వికీపీడియా పాలసీ సవరణ లేదా వికీప్రాజెక్ట్ సవరణ, పది వ్యాస సవరణలకు సమాన విలువైనదని 2008 లో జరిగిన అధ్యయనం తేల్చింది.[11]
వికీపీడియాలో ఉన్నత స్థాయికి ఎదగటానికి, ఎక్కువగా సవరణలు చేయటం సరిపోదు. అభ్యర్ధి వ్యాస పేరుబరి సవరణలు ఎక్కువగా వుండడం విజయం పొందే అవకాశాలను బలహీనంగా మాత్రమే ప్రభావితం చేస్తుంది. నిర్వహణ ప్రవర్తనను నిరూపించగలగాలి. వివిధరకాల అనుభవం, విధానాల రూపకల్పన, వికీప్రాజెక్టులలో కృషి నిర్వాహక హోదా పొందటానికి బలమైన తోడ్పాటునిస్తాయి. ఈ అభిప్రాయం సమన్వయ పని ఎక్కువగా పెరిగింది అనేదానికి[12][13], వికీపీడియా అనేది ఒక పరిపాలన పద్ధతి అనే దానికి సమర్ధనగా కూడా వుంది.[14] [...] 2006 కు పూర్వం, నిర్వాహక హోదాకు, వికీపీడియా విధానాలు, వికీప్రాజెక్టులలో పాల్గొనడం ప్రభావితం చేయలేదు. అంటే సముదాయం సాధారణ వ్యాస సమన్వయం కంటే విధానాలతయారీ, నిర్వహణ అనుభవం సముదాయం విలువైనదిగా పరిగణిస్తున్నదానికి నిదర్శనం..