విక్రమ్ కుమార్

విక్రం కె. కుమార్
జననం
త్రిసూర్, కేరళ[1]
వృత్తిసినీ దర్శకుడు
రచయిత
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీనిధి వెంకటేష్
తల్లిదండ్రులు
  • విజయ్ కుమార్ (తండ్రి)

విక్రమ్ కుమార్ ఒక సినీ దర్శకుడు, రచయిత. తమిళ, తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించి అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన మనం సినిమా మంచి ప్రజాదరణ పొందింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఇష్క్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విక్రమ్ కుమార్ స్వస్థలం కేరళ లోని త్రిసూర్. తమిళనాడులో పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. తండ్రి విజయ్ కుమార్. ఆయన ఉగాండా లో తేయాకు తోటల కంపెనీకి అధ్యక్షుడు. ఆ దేశంలో సరైన విద్యా సౌకర్యాలు లేవని భావించి విక్రం ను ఊటీలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించాడు. తర్వాత చెన్నై లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. చదువుకునేటప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.

మూలాలు

[మార్చు]
  1. సుంకరి, చంద్రశేఖర్. "పెళ్లికి ఆహ్వానిస్తే... సినిమా చెయ్యమన్నారు!". www.eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 18 జనవరి 2018. Retrieved 18 జనవరి 2018.