విక్రాంత్ | |
---|---|
జననం | విక్రాంత్ సంతోష్ 1984 నవంబరు 13[1] |
విద్య | విజువల్ కమ్యూనికేషన్ |
విద్యాసంస్థ | లయోలా కళాశాల, చెన్నై |
క్రియాశీల సంవత్సరాలు | 1991; 2005–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మానస హేమచంద్రన్ (m. 2009) |
బంధువులు | విజయ్ (కజిన్) ఎస్.ఎ.చంద్రశేఖర్ (అంకుల్) |
విక్రాంత్ సంతోష్ (జననం 1984 నవంబరు 13) తమిళ చిత్రసీమకు చెందిన భారతీయ నటుడు. ఆయన మొదట ఆర్. వి. ఉదయకుమార్ దర్శకత్వం వహించిన కర్క కసదర (2005) చిత్రంతో పరిచయం అయ్యాడు. ఆ తరువాత పలు రొమాంటిక్ డ్రామా చిత్రాలలో ఆయన నటించాడు.[2][3] సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కూడా పాల్గొన్న ఆయన, తరవాత పెద్ద సినిమాల ప్రాజెక్ట్‌లలో పనిచేసాడు.
ఆయన తల్లి షీలా పాండియన్ స్టోర్స్ (2018) చిత్రంలో నటించింది. తక్క తక్క (2015) చిత్రానికి అతని సోదరుడు సంజీవ్ దర్శకత్వం వహించాడు. దానికి ముందు, సంజీవ్ నటుడిగా, అభినయశ్రీ సరసన అందం అనే అసంపూర్ణ చిత్రంలో నటించాడు.[4] విక్రాంత్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కజిన్; శోభ చంద్రశేఖర్, ఎస్. ఎ. చంద్రశేఖర్ దంపతుల మేనల్లుడు.[5]
ఆయన దివంగత సినిమాటోగ్రాఫర్ హేమచంద్రన్, నటి కనకదుర్గల కుమార్తె అయిన నటి మానస హేమచంద్రన్‌ను 2009న అక్టోబరు 21న చెన్నైలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం, పెద్ద కుమారుడు 2010 జూలై 23న, చిన్న కుమారుడు మార్చి 2016లో జన్మించారు.[6]
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
1991 | అజగన్ | అళగప్పన్ కొడుకు | బాల కళాకారుడు |
2005 | కర్క కసదర | రాహుల్ | |
2007 | నినైతు నినైతు పార్థేన్ | ఆదికేశవన్ | |
ముధల్ కనవే | హరిహరన్ ప్రభు | ||
2008 | నెంజతై కిల్లాతే | వసంత్ | |
2009 | ఎంగల్ ఆసన్ | వాసు | |
2010 | గోరిపాళయం | పాండి | |
2011 | ముత్తుక్కు ముత్తగా | బోస్ | |
సత్తపది కుట్రం | తంగరాజ్ | ||
2013 | పాండియనాడు | సేతు | అతిథి పాత్ర |
2015 | తక్క తక్క | సత్య | |
2016 | గేతు | క్రెయిగ్ (బుల్) | |
2017 | కవన్ | అబ్దుల్ కాదర్ | |
తొండన్ | విక్కీ | ||
నెంజిల్ తునివిరుంధాల్ | మహేష్ | తెలుగులో C/o సూర్యగా ఏకకాలంలో తీశారు | |
2019 | సుట్టు పిడిక్క ఉత్తరావు | అశోక్ | |
వెన్నిల కబడ్డీ కుజు 2 | శరవణన్ | ||
బక్రీద్ | రత్నం | ||
2022 | నాన్ మిరుగమై మార | సాతాను |
సంవత్సరం | షో | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
2021 | సర్వైవర్ తమిళ్ | పార్టిసిపెంట్ | జీ తమిళం |