విజయ నందసిరి | |
---|---|
జననం | 1944 మే 6 కొలంబో శ్రీలంక |
మరణం | 2016 ఆగస్టు 8 కొలంబో శ్రీలంక |
జాతీయత | శ్రీలంక జాతీయుడు |
విద్య | కొలంబో విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు దర్శకుడు నిర్మాత గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1966–2016 |
పిల్లలు | 2 |
ఇలుక్పిటియ ముదియన్సెలాగే విజయ నందసిరి (జననం 6 మే 1944 – 8 ఆగష్టు 2016 [1] శ్రీలంక సినిమా, రంగస్థల నాటకం టెలివిజన్లో నటుడు . [2] , [3] అతను గాయకుడు నిర్మాత కూడా. [4]
6 మే 1944న కొలంబోలో ఏడుగురు తోబుట్టువులతో కూడిన కుటుంబంలో మూడవ వ్యక్తిగా జన్మించాడు, [4] అతనికి ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్లు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. [5] ఇతన్ని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. విజయానంద సిరి తల్లి వైద్యురాలిగా పనిచేస్తూ ఉండేది.
నందసిరి సింహళ భాషలో ప్రసారమైన దారా వాహిక లలో నటించాడు. ఇతని ఎక్కువగా హాస్య పాత్రలు పోషిస్తూ ఉండేవాడు.
ఇతను భారతదేశంలోని హిందీ దారా వాహి కలలో కూడా నటించాడు.
అతను మొదట రణ్ కెండా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. 1973లో, సతీశ్చంద్ర ఎదిరిసింఘే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయాన్ని సాధించింది. అతను సికురు హాతేలో అనే సినిమాలో పోషించిన పాత్రకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
నందసిరి చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. అతని కాలికి గాయం కారణంగా, తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా, కాలును తీసేసారు. అప్పటి నుండి, అతను కృత్రిమ కాలును ఉపయోగిస్తున్నాడు. [6]
8 ఆగస్టు 2016న నందసిరి గుండెపోటుతో బాధపడుతూ కలుబోవిల బోధనాసుపత్రికి తీసుకెళుతుండగా మరణించారు. [7] [8] [9]