విజయలక్ష్మి | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | విజ్జి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1997–2018 |
విజయలక్ష్మి భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది. 1997లో, ఆమె నాగమండల చిత్రంతో కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టింది.[2] ఇందులో రాణిగా నటించిన ఆమెకు కన్నడలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది.[3]
తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ (2001)లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది.
విజయలక్ష్మి మద్రాస్‌లో జన్మించింది. కర్ణాటకలోని బెంగళూరులో చదువుకుంది. ఆమె మాతృభాష తమిళం. ఆమెకు ఉష అనే సోదరి ఉంది. ఆమె తల్లి శ్రీలంక తమిళురాలు.[4]
విజయలక్ష్మి తన కెరీర్‌లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. అందులో 25 కన్నడ చిత్రాలు ఉన్నాయి. ఆమె ప్రకాష్ రాజ్ సరసన జానపద కథ ఆధారంగా దర్శకుడు టి. ఎస్. నాగాభరణ దర్శకత్వం వహించిన నాగమండల చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆమె తన అందం, అభినయంతో గుర్తింపు పొందింది.
తమిళంలో పూంతోట్టం సినిమాతో ఆమె రంగప్రవేశం చేసింది. తమిళంలో విజయ్, సూర్యతో కలిసి ఫ్రెండ్స్ చిత్రంలో నటించింది.[5] ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత, ఆమె కలకలప్పు, రామచంద్ర, మిలిటరీ, సూరితో సహా అనేక చిత్రాలలో నటించింది.[6] అంతేకాకుండా తమిళ కామెడీ చిత్రం బాస్ ఎంగిర భాస్కరన్‌తో ప్రేక్షకులలో ఆమె ప్రజాదరణ పొందింది. ఇది 2010లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.[7] ఈ చిత్రం తెలుగులో నేనే అంబానీగా విడుదలైంది.[8]
తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మోహన్‌లాల్‌తో ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది.[9]
ఆమె కొన్ని తమిళ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది. రాడాన్ మీడియా వర్క్స్ నిర్మించిన బంగారు బేటే అనే గేమ్ షోకి ఆమె యాంకర్ కూడా.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)