విజయ్ రాఘవేంద్ర భారతీయ నటుడు. ప్రధానంగా ఆయన కన్నడ చిత్రాలలో నటిస్తాడు. 1993 వచ్చిన పిల్లల చిత్రం చిన్నారి ముత్తతో ప్రసిద్ధి చెందాడు.[1] ఆయన నిర్మాత ఎస్. ఎ. చిన్నే గౌడ కుమారుడు, అలాగే నటుడు డాక్టర్. రాజ్‌కుమార్ మేనల్లుడు.[2]
ఆయన చలిసువ మొదగలు (1982) చిత్రం ద్వారా బాల నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. చిన్నారి ముత్తతో పాటు కొట్రేశి కనసు (1994) చిత్రాలలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[3] అంతేకాకుండా ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[4] ఆయన మొదటి ప్రధాన పాత్ర 2002లో రామోజీ రావు నిర్మించిన నినాగాగి, ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2006లో, టి. ఎస్. నాగాభరణ పీరియాడికల్ డ్రామా కల్లరాలి హూవాగిలో ఆయన తన పాత్రకు మరింత గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో అతని హోమ్ ప్రొడక్షన్ చిత్రం సెవంతి సేవంతిలో నటించాడు. 2016లో, శివయోగి శ్రీ పుట్టయ్యజ్జ జీవిత చరిత్ర చిత్రంలో పుట్టరాజ్ గవాయి పాత్రను పోషించినందుకు, ఆయనకు ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందించింది.[5] 2018లో, ఆయన కిస్మత్ (2018)లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[6]
2013లో, ప్రేక్షకుల ఓటు ద్వారా, విజయ్ రాఘవేంద్ర గేమ్ షో బిగ్ బాస్ మొదటి సీజన్‌ను గెలుచుకున్నాడు.[7]
విజయ్ రాఘవేంద్ర బెంగళూరులో ఎస్.ఎ.చిన్నెగౌడ, జయమ్మ దంపతులకు పెద్ద సంతానంగా జన్మించాడు. ఆయన తండ్రి సినిమా నిర్మాత కాగా మేనమామ రాజ్‌కుమార్ ప్రముఖ నటుడు. దీంతో ఆయన వారి చిత్రాలలో నటించడం ప్రారంభించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు ఎనిమిది చిత్రాలలో నటించిన తర్వాత, ఆయన చెన్నైలో నటనలో శిక్షణ పొందాడు.[8]
అతని తమ్ముడు శ్రీమురళి కన్నడ సినిమా నటుడు. అతని తండ్రి తరపు మేనత్త పార్వతమ్మ రాజ్‌కుమార్ కన్నడ సినిమాలో ప్రముఖ సినీ నిర్మాత, పంపిణీదారు. ఆయన నటులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్‌ల బంధువు.
2007 ఆగస్ట్ 26న, ఆయన అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, బి. కె. శివరామ్ కుమార్తె స్పందనను వివాహం చేసుకున్నాడు.[9][10] ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు, అనైరా అనే కుమార్తె ఉన్నారు. అయితే స్పందన 2023 ఆగస్టు 7న బ్యాంకాక్‌లో గుండెపోటుతో మరణించింది.[11]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)