విజయ్ వర్మ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
విజయ్ వర్మ ఒక తెలుగు, హిందీ సినీ నటుడు.
విజయ్ వర్మ హైదరాబాదులో స్థిరపడిన ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. సినిమా రంగం మీద ఆసక్తితో పుణె లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి దరఖాస్తు చేశాడు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో అందులో ఎఫ్. టి. ఐ. ఐ కోర్సులో చేరాడు.[1]
విజయ్ ముందుగా హైదరాబాదులోని నాటకరంగంలో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. కొద్దికాలం తర్వాత పుణెలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. అక్కడ రెండేళ్ళ పాటు శిక్షణ పొందాడు. అది పూర్తయిన తర్వాత అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. ముందుగా రాజ్ నిడిమోరు, కృష్ణ డి. కె రూపొందించిన ఒక లఘుచిత్రంలో నటించాడు. ఈ చిత్రం న్యూయార్క్ లో జరిగిన చిత్రోత్సవంలో మొదటి బహుమతి చేజిక్కించుకుంది.[2]
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2008 | షోర్ | రమేష్ | షార్ట్ ఫిల్మ్ | |
2012 | చిట్టగాంగ్ | జుంకు ( సుబోధ్ రాయ్ ) | ||
2013 | రంగేజ్ | పాక్య | ||
2014 | గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్ | రాబిన్ హుడ్ | ||
2016 | పింక్ | అంకిత్ మల్హోత్రా | ||
2017 | మాన్‌సూన్ షూట్‌అవుట్ | ఆదిత్య "ఆది" | ||
రాగ్ దేశ్ | జమాల్ కిద్వాయ్ | |||
మిడిల్ క్లాస్ అబ్బాయి | శివశక్తి | తెలుగు సినిమాలు | ||
2018 | అంగీ | అన్సార్ షబ్నమ్ హార్ట్ | ||
2019 | గల్లీ బాయ్ | మొయిన్ ఆరిఫ్ | ||
సూపర్ 30 | ఫగ్గ కుమార్ | ప్రత్యేక ప్రదర్శన | ||
2020 | ఘోస్ట్ స్టోరీస్ | గుడ్డు | జోయా అక్తర్ విభాగం | |
బాఘీ 3 | అక్తర్ లాహోరి | |||
బామ్‌ఫాడ్ | జిగర్ ఫరీది | |||
యారా | రిజ్వాన్ షేక్ | |||
2022 | హర్దంగ్ | లోహా సింగ్ | ||
డార్లింగ్స్ | హంజా షేక్ | |||
2023 | లస్ట్ స్టోరీస్ 2 | విజయ్ చౌహాన్ | విభాగం: "మాజీతో సెక్స్" | |
జానే జానే | ఇన్‌స్పెక్టర్ కరణ్ ఆనంద్ | |||
2024 | మర్డర్ ముబారక్ | ఆకాష్ డోగ్రా | [3][4] | |
సిరియా43 † | TBA | తమిళ సినిమా | [5] | |
ఉల్ జలూల్ ఇష్క్ † | TBA | చిత్రీకరణ | [6] |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2018 | చీర్స్-ఫ్రెండ్స్, రీయూనియన్, గోవా | సిగ్గీ | ||
2020 | ఎ సూటబుల్ బాయ్ | రషీద్ | [7] | |
షీ | సస్య | |||
2020–ప్రస్తుతం | మీర్జాపూర్ | భరత్ త్యాగి / శత్రుఘ్న త్యాగి | సీజన్ 2,3 | |
2021 | ఓకే కంప్యూటర్ | గ్రహీత యొక్క మునిసిపాలిటీ | ||
2023 | దహాద్ | ఆనంద్ స్వర్ణాకర్ | [8] | |
కాల్‌కూట్ | ఎస్‌ఐ రవిశంకర్ త్రిపాఠి | [9] | ||
2024 | IC 814: ది కాందహార్ హైజాక్ | కెప్టెన్ శరణ్ | [10] |
సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
2019 | 26వ స్క్రీన్ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు | గల్లీ బాయ్ | నామినేట్ చేయబడింది | |
2020 | 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ చేయబడింది | ||
2023 | బాలీవుడ్ హంగామా స్టైల్ చిహ్నాలు | అత్యంత స్టైలిష్ ఎమర్జింగ్ ఐకాన్ | - | గెలిచింది | |
అత్యంత స్టైలిష్ బ్రేక్‌త్రూ టాలెంట్ (పురుషుడు) | - | నామినేట్ చేయబడింది | |||
ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు | సిరీస్ (క్రిటిక్స్) డ్రామాలో ఉత్తమ నటుడు | పూత | గెలిచింది | ||
డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ నటుడు (వెబ్ ఒరిజినల్ ఫిల్మ్) | డార్లింగ్స్ | నామినేట్ చేయబడింది |