విజయ్ సేతుపతి | |
---|---|
![]() విజయ్ సేతుపతి పోస్టర్ | |
దర్శకత్వం | విజయ్ చందర్ |
రచన | విజయ్ చందర్ |
నిర్మాత | భారతీ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్. వేల్‌రాజ్ |
కూర్పు | ప్రవీణ్ కె.ఎల్ |
సంగీతం | వివేక్ మర్విన్ |
నిర్మాణ సంస్థ | విజయ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | లిబ్రా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 14 మే 2021 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
విజయ్ సేతుపతి, 2021లో విడుదలైన తెలుగు సినిమా. 2019లో తమిళంలో వచ్చిన ‘సంఘతమిజన్’ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా విజయ్ చందర్ దర్శకత్వం వహించాడు.[1]
చరణ్( విజయ్ సేతుపతి) సినిమాల్లో నటునిగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.ఈ క్రమంలో హీరోయిన్ రాశి ఖన్నా(కమలిని) తో పరిచయం ఏర్పడుతుంది.కానీ ఆమె పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయ్యినటువంటి సంజయ్(రవికిషన్) కూతురు.ఈ రవికిషన్ కు సంబంధించిన ఓ కెమికల్ ఫ్యాక్టరీ రామాపురం అనే ఊర్లో పెట్టాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న చరణ్ అడ్డుపడతాడు.ఇలా అడ్డుగా ఉన్న చరణ్ని అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే చంటబ్బాయ్ (అషుతోష్ రానా) ఏం చేశాడు? అసలు చరణ్ కు ఈ కథకు సంబంధం ఏమిటి? కమలిని పాత్రకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ఆ ఊరిలోకి ఆ కెమికల్ ఫ్యాక్టరీను రాకుండా ఎవరు ఆపారు అనేదే సినిమా కథ.[2]