విదిశ శ్రీవాస్తవ

విదిశ
జననం
విదిశ శ్రీవాస్తవ

(1991-04-28) 1991 ఏప్రిల్ 28 (వయసు 33)[1]
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లువిదిశ
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
బంధువులుశాన్వీ శ్రీవాస్తవ (చెల్లెలు)

విదిశగా పిలవబడే విదిశ శ్రీవాస్తవ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా తెలుగు చలన చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.

కెరియరు

[మార్చు]

విదిశ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది. ఆమెకు ఒక అన్నయ్య, ఒక చెల్లి. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే.[2] ఆమె బయోటెక్నాలజీలో పట్టభద్రురాలైనది, వ్యాపార నిర్వహణలో ఒక కోర్సు చేసింది.[3]

విదిషకు నటి కావాలని కొరిక, కానీ మొదట మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది.[3] ఆమె 19 ఏళ్ళ వయస్సులో 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే చిత్రంతో నటిగా పరిచయమైనది.[4][5] 2007 సంవత్సరంలో ఆమె మూడు చిత్రాలు అలా,ప్రేమ్‌, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ విడుదలయ్యాయి. విటిలో అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి. విజయం సాదించింది.[6]

తరువాత ఆమె నలి నలియుతు అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం కాత్తవరాయన్‌ 2008లో విడుదలైనది.[7][8] అలాగే ఆమె తొలి మళయాళ చిత్రం లక్కీ జొకర్స్ 2011లో విడుదలైనది.[9] ఆమె ఆ తరువాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఆమె కన్నడ చిత్రం విరాట్‌ లో నటించింది.[10]

ఆ తరువాత ఆమె జనతా గ్యారేజ్ లో చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె "యే హై మొహబత్తేన్" అనే హిందీ దారావాహికలో నటిస్తుంది.

అత్తిలి సత్తిబాబు

నటించిన చిత్రాలు

[మార్చు]
యే హై మొహబత్తేన్
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2007 మా ఇద్దరి మధ్య శివాని తెలుగు
2007 అలా తెలుగు
2007 ప్రేమ్ పవిత్రా తెలుగు
2007 అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అమ్ములు తెలుగు
2007 నలి నలియతు జెన్నిఫర్ కన్నడ
2008 కాత్తవరాయన్‌ మలతి తమిళం
2011 లక్కీ జొకర్స్ లక్ష్మి తంపురత్తి మళయాళం
2012 దేవరాయ స్వప్నా తెలుగు
2016 విరాట్ స్పూర్తి కన్నడ
2016 జనతా గ్యారేజ్ రియా తెలుగు
2017-2018 యే హై మొహబత్తేన్ రొషిని హిందీ తొలి హిందీ దారావాహిక

మూలాలు

[మార్చు]
  1. "Stars : Star Interviews : Vidisha's personal side". Telugucinema.com. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  2. "Small town gal with big dreams | Deccan Chronicle". Archives.deccanchronicle.com. 16 అక్టోబరు 2013. Archived from the original on 21 ఫిబ్రవరి 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  3. 3.0 3.1 "Times of India Publications". Web.archive.org. 16 మే 2011. Archived from the original on 16 ఫిబ్రవరి 2014. Retrieved 28 మే 2018.
  4. "Telugu Movie Reviews - Maa Iddari Madhya". CineGoer.com. 8 సెప్టెంబరు 2006. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  5. "Maa Iddari Madhya Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes". Indiaglitz.com. 8 సెప్టెంబరు 2006. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  6. "Box - Office Report 2007". TeluguCinema.Com. 25 డిసెంబరు 2007. Archived from the original on 6 ఆగస్టు 2012. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  7. "Kathavaraayan, a mindless outing". Rediff.com. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  8. "The K factor - Kaathavaraayan". The Hindu. 6 జూన్ 2008. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  9. "Movie Review : Lucky Jokers". Sify.com. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.
  10. "Viraat shooting from Feb 22". Sify.com. 22 ఫిబ్రవరి 2012. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 16 ఫిబ్రవరి 2014.

భాహ్యా లింకులు

[మార్చు]