విద్యా మాల్వాదే | |
---|---|
జననం | |
వృత్తి | ఎయిర్ హోస్టెస్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అరవింద్ సింగ్ బగ్గా
(m. 1997; died 2000)సంజయ్ దయామా (m. 2009) |
విద్యా మాల్వాదే (జననం 1973 మార్చి 2) ఒక భారతీయ నటి.
విద్యా మాల్వాదే 1973 మార్చి 2న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[1][2] ఆమె ప్రముఖ నటి స్మితా పాటిల్ మేనకోడలు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.[3]
విద్య ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె మోడలింగ్ రంగంలోకి దిగింది. ఆమెను ప్రకటనల కోసం యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ ఎంపిక చేసుకున్నాడు. ఆమె తొలిసారిగా విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఇంతేహా (2003)లో నటించింది. అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[4] అయినా, తదపరి వరుస విజయవంతమైన సినిమాలు, అనేక ప్రకటనల తర్వాత, ఆమె 2007లో చక్ దే ఇండియాలో భారత మహిళల జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్‌గా నటించింది.[5] ఆమె యారా సిల్లీ సిల్లీలోనూ నటించింది.[6]
విద్య లా చదివి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది.[7] ఆమె మొదటి భర్త, కెప్టెన్ అరవింద్ సింగ్ బగ్గా[8], అలయన్స్ ఎయిర్‌లో పైలట్. 2000లో అతని విమానం అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నాలోని ఒక భవనంపై కూలిపోవడంతో మరణించాడు.[9] 2009లో, ఆమె ఆస్కార్ అవార్డ్-నామినేట్ అయిన లగాన్‌లో సినిమా స్క్రీన్‌ప్లే రచయిత, అసోసియేట్ డైరెక్టర్‌గా అశుతోష్ గోవారికర్‌తో కలిసి పనిచేసిన సంజయ్ దైయామాను వివాహం చేసుకుంది.[10]
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2003 | ఇంతేహా | నందిని సక్సేనా | |
2005 | మషూకా | మోనికా | |
యూ, బమ్సీ ఎన్ మీ | షెహనాజ్ | ||
2007 | చక్ దే! ఇండియా | విద్యా శర్మ | |
2008 | బీనామ్ | ||
కిడ్నాప్ | మల్లికా రైనా | ||
2010 | తుమ్ మీలో తో సాహి | అనితా నాగ్‌పాల్ | |
ఆప్ కే లియే హమ్ | |||
నో ప్రాబ్లమ్ | |||
దస్ తోలా | ఖాజీ బేగం- ప్రత్యేక ప్రదర్శన | ||
స్ట్రైకర్ | దేవి | ||
2012 | చక్రధర్ | అవంతిక | |
1920: ఈవిల్ రిటర్న్స్ | కరుణా | ||
శోభన 7 నైట్స్ | |||
2013 | వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా! | అతిధి పాత్ర | |
2014 | లవ్... ఫిర్ కభీ | ||
2015 | యారా సిల్లీ సిల్లీ | అక్షర | |
2017 | హార్ట్ బీట్స్ | నైనా | |
2021 | కోయి జానే నా | రష్మీ | అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్ |
2023 | స్టార్ ఫిష్ | సుకన్య సల్గాంకర్ |
సంవత్సరం | షో / ధారావాహిక | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2005 | మిర్చి టాప్ 20 | హోస్ట్ | మ్యూజిక్ హిట్స్ షో |
2006 | ఫ్యామిలీ నం. 1 | ప్రధాన పాత్ర | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (ఇండియా)లో ప్రసారం చేయబడింది |
2008 | ఫియర్ ఫ్యాక్టర్ - ఖత్రోన్ కే ఖిలాడి | పోటీదారు | కలర్స్ టీవీలో ప్రసారమైంది |
2015 | డర్ సబ్కో లగ్తా హై | డా. నైనా | "అబ్బే విల్లా" (ఎపిసోడ్ వన్) |
సంవత్సరం | టైటిల్ | పాత్ర | ప్లాట్ ఫామ్ |
---|---|---|---|
2019 | ఇన్ సైడ్ ఎడ్జ్ 2 | తీషా చోప్రా | అమెజాన్ ప్రైమ్ వీడియో |
2020 | ఫ్లెష్ | రెబా గుప్తా | ఎరోస్ నౌ |
2020–ప్రస్తుతం | మిస్ మ్యాచ్డ్ | జీనత్ కరీం | నెట్‌ఫ్లిక్స్ |
2020 | వూజ్ యువర్ డాడి | మోనికా బగ్గా | ఆల్ట్ బాలాజీ, జీ5 |
2021 | బామిని అండ్ బాయ్స్ | బామిని | డిస్నీ+ హాట్‌స్టార్ |
2022 | డా. అరోరా | వైశాలి | సోనీ లీవ్ |
సంవత్సరం | సినిమా | పురస్కారం | కేటగిరి | ఫలితం |
---|---|---|---|---|
2004 | ఇంతేహా | ఫిల్మ్‌ఫేర్ అవార్డు | ఉత్తమ మహిళా అరంగేట్రం | |
స్క్రీన్ అవార్డులు | ఉత్తమ మహిళా అరంగేట్రం | |||
స్టార్ గిల్డ్ అవార్డులు | ఉత్తమ మహిళా అరంగేట్రం | |||
స్టార్‌డస్ట్ అవార్డులు | రేపటి సూపర్ స్టార్- స్త్రీ | |||
బెస్ట్ బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ – ఫిమేల్ | ||||
2009 | కిడ్నాప్ |