వినయ్ మోహన్ క్వాత్రా | |
---|---|
![]() 2024లో వినయ్ క్వాత్రా.. | |
29వ యునైటెడ్ స్టేట్స్లో భారత రాయబారి | |
Assumed office 2024 ఆగస్టు 1 | |
అధ్యక్షుడు | ద్రౌపది ముర్ము |
అంతకు ముందు వారు | తరంజిత్ సింగ్ సంధు |
34వ భారతదేశ విదేశాంగ కార్యదర్శి | |
In office 2022 మే 1 – 2024 జూలై 14 | |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ |
మినిస్టర్ | సుబ్రహ్మణ్యం జైశంకర్ |
అంతకు ముందు వారు | హర్ష్ వర్ధన్ ష్రింగ్లా[1] |
తరువాత వారు | విక్రమ్ మిస్రీ |
25వ నేపాల్‌లో భారత రాయబారి | |
In office మార్చి 2020 – ఏప్రిల్ 2022 | |
అంతకు ముందు వారు | మంజీవ్ సింగ్ పూరి |
తరువాత వారు | నవీన్ శ్రీవాస్తవ |
24వ ఫ్రాన్స్‌లో భారత రాయబారి | |
In office జులై 2017 – ఫిబ్రవరి 2020 | |
అంతకు ముందు వారు | డాక్టర్ మోహన్ కుమార్ |
తరువాత వారు | జావేద్ అష్రఫ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1962 (age 62–63) భారతదేశం |
జీవిత భాగస్వామి | పూజ |
సంతానం | 2 కుమారులు |
చదువు | ఎం.ఎస్సీ |
కళాశాల | జి. బి. పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ |
వృత్తి | ఇండియన్ ఫారిన్ సర్వీస్ |
నైపుణ్యం | దౌత్యవేత్త |
వినయ్ మోహన్ క్వాత్రా, (జననం 1962) ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ భారతీయ దౌత్యవేత్త. అతను భారతదేశ 34వ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసాడు. హర్ష్ వర్ధన్ ష్రింగ్లా నుండి బాధ్యతలు స్వీకరించిన ఆయన 2022 మే నుండి 2024 జూలై 14 వరకు కొనసాగాడు. అలాగే యునైటెడ్ స్టేట్స్లో భారత రాయబారిగా ఉన్నాడు.[2][3] గతంలో, అతను ఫ్రాన్స్, నేపాల్కు భారత రాయబారిగా పనిచేసాడు.[4][5]
వినయ్ మోహన్ క్వాత్రా 1962 డిసెంబరు 15న జన్మించాడు.[6] ఆయన జి. బి. పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుండి బి. ఎస్సి అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ (హానర్స్),, మాస్టర్స్ ఇన్ సైన్స్ (ఎం. ఎస్సి) పూర్తి చేసాడు.[7][8] ఆయన గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ నుండి అంతర్జాతీయ సంబంధాలలో డిప్లొమా కూడా పొందాడు.[9] ఆయన ఫ్రెంచ్, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతాడు.
ఆయన భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖలో, ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసాడు. ఆయన 2010 మే నుండి 2013 జూలై వరకు వాషింగ్టన్ డి. సి. లోని భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య మంత్రిగా కూడా పనిచేసాడు. 2013 జూలై, 2015 అక్టోబరుల మధ్య, ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ పాలసీ ప్లానింగ్ & రీసెర్చ్ విభాగానికి నాయకత్వం వహించాడు, ఆ తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అమెరికాస్ డివిజన్ అధిపతిగా పనిచేసాడు. అక్కడ ఆయన యునైటెడ్ స్టేట్స్, కెనడాతో భారతదేశ సంబంధాలను పరిష్కరించాడు.[10] విదేశాలలో, భారతదేశంలో అనేక భారత మిషన్లలో వివిధ పదవులలో ఆయన పనిచేసాడు. ఇలా ఆయనకు దాదాపు 32 సంవత్సరాల అనుభవం ఉంది.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా 2022 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన తరువాత భారత విదేశాంగ కార్యదర్శి పదవిని చేపట్టడానికి ఆయన స్థానంలో వినయ్ క్వాత్రా బాధ్యతలు స్వీకరిస్తాడని 2022 ఏప్రిల్ 4న ప్రకటించారు.[11] మే 1న, ఆయన భారతదేశ 34 వ విదేశాంగ కార్యదర్శి అయ్యాడు, 2024 జూలై 14 వరకు అక్కడ పనిచేసాడు.[12][13]
ఆయన పూజా క్వాత్రాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. .[14]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)