వినాయకన్ | |
---|---|
![]() 2022లో వినాయకన్ | |
జననం | వినాయకన్ టి.కె. |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
బంధువులు | విజయన్ (సోదరుడు) |
పురస్కారాలు | ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం (2016) |
వినాయకన్ భారతీయ నటుడు. నృత్యకారుడు, స్వరకర్త,కూడా అయిన ఆయన ప్రధానంగా మలయాళం, తమిళ భాషా చిత్రాలలో పని చేస్తాడు.[1][2][3] ఆయన 1995 చిత్రం మాంత్రికంలో అతిధి పాత్రతో తన నటనను ప్రారంభించాడు. ఆ తర్వాత రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో పాటు హాస్య పాత్రలు కూడా చేశాడు.
2016లో, రాజీవ్ రవి దర్శకత్వంలో వచ్చిన కమ్మటిపాడమ్‌లో గంగ పాత్రకు వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. తన నటనకు విమర్శకులచే ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి అతను ఒక పాటను కూడా స్వరపరిచాడు.[4][5] ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలలో ఆడు - ఒరు భీగర జీవి ఆను, ఆడు 2 ఉన్నాయి. అంతేకాకుండా లిజో జోస్ పెల్లిస్సేరీ ఈ.మా.యౌ చిత్రం ది హిందూ దశాబ్దపు టాప్ 25 మలయాళ చిత్రాలలో ఒకటిగా నమోదయింది. అలాగే న్యూ వేవ్ మూవ్‌మెంట్ ఖాతాలోనూ చేరింది.
రజనీకాంత్ నటించిన నెల్సన్ దిలీప్‌కుమార్ తమిళ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జైలర్ (2023)లో విలన్‌గా నటించి మరింత ప్రసిద్ధిచెందాడు. అతని రాబోయే ప్రాజెక్ట్‌లలో గౌతమ్ మీనన్ ధ్రువ నచ్చతిరం: చాప్టర్ వన్ - యుద్ధ కాండమ్.
2006లో తెలుగు యాక్షన్ చిత్రం అసాధ్యుడులో తంబి పాత్రతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.[6]
సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | పలితం |
---|---|---|---|---|
2016 | కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్ | ఉత్తమ నటుడు | కమ్మటిపాడమ్ | విజేత |
2016 | మూవీ మున్షీ సినీ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | కమ్మటిపాడమ్ | విజేత |
2017 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు | కమ్మటిపాడమ్ | విజేత |
2017 | సిపిసి సినీ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | కమ్మటిపాడమ్ | విజేత |
2018 | సిపిసి సినీ అవార్డ్స్ | ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ | ఈ.మా.యౌ. | విజేత |
2019 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు | ఈ.మా.యౌ. | విజేత |