వినోదం | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | [[దివాకర్ బాబు]] |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి |
తారాగణం | శ్రీకాంత్, రవళి |
ఛాయాగ్రహణం | టి. శరత్ |
కూర్పు | రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2 ఆగస్టు 1996[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.
సంభాషణలు : దివాకర బాబు
రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]