విన్నీ అరోరా | |
---|---|
జననం | [1] | 1991 జూన్ 28
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | లాల్ ఇష్క్ (2018 టీవి సిరీస్) లాడో – వీర్‌పూర్ కి మర్దానీ ఉడాన్ (2014 టీవీ సిరీస్) |
జీవిత భాగస్వామి | ధీరజ్ ధూపర్ (m. 2016) |
పిల్లలు | 1 |
విన్నీ అరోరా ధూపర్ (జననం 1991 జూన్ 28) ఒక భారతీయ టెలివిజన్ నటి.[2] ఆమె తన నటనా వృత్తిని కస్తూరి ధారావాహికతో ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె కుచ్ ఈజ్ తారా, ఆత్వాన్ వచన లలో నటించింది. ఆమె మాత్ పితా కే చార్నోన్ మే స్వర్గ్, శుభ్ వివాహ్, ఇత్నాకరో నా ముఝే ప్యార్ వంటి వాటిలో ప్రముఖ పాత్రలు పోషించింది. ఆమె చివరిసారిగా కలర్స్ టీవీ లాడో-వీర్పూర్ కీ మర్దానీలో జూహీ సేథీగా కనిపించింది.
విన్నీ అరోరా తన సహా నటుడు ధీరజ్ ధూపర్ ని 2016 నవంబరు 16న ఢిల్లీలో వివాహం చేసుకుంది.[3][4][5] 2022 ఆగస్టు 10న, ఈ జంటకు ఒక అబ్బాయి జన్మించాడు.[6][7]
విన్నీ అరోరా 16 సంవత్సరాల వయస్సులో టెలివిజన్‌లో మొదటిసారి అడుగుపెట్టింది. ఆమె ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పాత్రలు చాలా వరకు కైవసం చేసుకుంది. ఆమె స్టార్ ప్లస్, సోనీ టీవీ, కలర్స్ టీవీ, లైఫ్ ఓకే వంటి అనేక వినోద ఛానెల్‌లలో భాగమైంది. ఆమె బిందాస్‌లోని యే హై ఆషికీలో ది అదర్ మమ్మీ అనే ఎపిసోడ్‌లో సాచిగా కనిపించింది. టెలివిజన్ ధారావాహికలే కాకుండా, అరోరా 2015లో సొనాటా వాచెస్ వెడ్డింగ్ కలెక్షన్ కోసం టీవీ వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించింది. ఆమె 2016లో అవార్డు గెలుచుకున్న ధనక్ చిత్రంలో ఆశా అనే ఉపాధ్యాయురాలిగా నటించింది. ఆమె చివరిగా కలర్స్ టీవీలో లాడో - వీర్‌పూర్ కి మర్దానీలో జూహీ సేథి పాత్రను, పతి పత్నీ ఔర్ వో అనే వెబ్ సిరీస్‌లో సురభి పాత్రను పోషించింది. [8]
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | గమనిక |
---|---|---|---|
2007 | కస్తూరి | ద్రష్టి | |
2008 | కుచ్ ఈజ్ తారా | సిమ్రాన్ | |
ఆత్వాన్ వచన | ఊర్మిళా శాస్త్రి | ||
2009 | మాట్ పితా కే చార్నోన్ మే స్వర్గ్ | గాయత్రి | |
2011 | క్రైమ్ పెట్రోల్ | రోష్ని పటేల్ | |
2012 | శుభ్ వివాహ్ | నీలు సక్సేనా నిగమ్ | |
మెయిన్ లక్ష్మి తేరే ఆంగన్ కీ | గిన్ను | ||
2013 | ఫియర్ ఫైళ్స్ | నిధి | |
రసోయి కి రాణి | అతిథి | ||
దో దిల్ ఏక్ జాన్ | రుక్సానా | ||
2014 | యే హై ఆషికి | శచీ | |
సరస్వతిచంద్ర | ఖుషీ | ||
హమ్ హై నా | సత్య | ||
2015 | కోడ్ రెడ్-ముఖతా | అర్పితా | ఎపిసోడ్ 48 |
ఇత్నా కరో నా ముఝే ప్యార్ | నిశి ఖన్నా | ||
2016 | ఉడాన్ | టీనా రాయ్చంద్ | |
2018 | లాడో-వీర్పూర్ కీ మర్దానీ | జూహీ సేథీ | |
జుజ్ బాట్ | అతిథి | ||
లాల్ ఇష్క్ | మధు | ఎపిసోడ్ 45 |
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2016 | ధనక్ | ఆశా | 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రం |
సంవత్సరం | శీర్షిక | పాత్ర |
---|---|---|
2020 | పతి పత్ని ఔర్ వో | సురభీ |