విమలా రామన్ | |
---|---|
![]() 2013లో ముంబైలో జరిగిన ముంబై మిర్రర్ సినిమా పత్రికా సమావేశంలో విమలా రామన్ | |
జననం | విమలా రామన్ జనవరి 23, 1982 సిడ్ని, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా |
జాతీయత | ఆస్ట్రేలియన్ |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | పట్టాభి రామన్ శాంతా రామన్ |
విమలా రామన్ భారతీయ సినిమా నటి, మోడల్. 2009లో ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]
బెంగళూరు తమిళ కుటుంబానికి చెందిన విమలా రామన్ 1982, జనవరి 23న పట్టాభి రామన్, శాంతా రామన్ దంపతులకు ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్ని పుట్టి పెరిగింది. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన విమలా రామన్ భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా,[3] 2005లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ - బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ గెలుచుకుంది.
2005లో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి అనే తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది.[4] మొట్టమొదటి మలయాళ చిత్రం టైమ్ సినిమాలో సురేష్ గోపితో కలిసి నటించింది. 2007లో అజ్మల్ అమీర్‌తో కలిసి ప్రణయకాలం సినిమాలో, జయరామ్‌తో కలిసి సూర్యన్ సినిమాలో నటించింది. 2009లో ఎవరైనా ఎప్పుడైనా తెలుగు సినిమాలో నటించింది. తరువాత గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2006 | పోయి | శిల్ప | తమిళం | |
2007 | టైం | వైగా మీనన్ | మలయాళం | |
2007 | ప్రణయకాలం | మరియా | మలయాళం | |
2007 | సూర్యన్ | మాయ | మలయాళం | |
2007 | నస్రాని | సరహ్ ఈపన్ | మలయాళం | |
2007 | రోమియో | డా. ప్రియా | మలయాళం | |
2008 | కలకత్తా న్యూస్ | స్మిత | మలయాళం | |
2008 | కాలేజ్ కుమరన్ | మాధవి మీనన్ | మలయాళం | |
2008 | అపూర్వ | లక్ష్మీదేవి | మలయాళం | |
2008 | రామన్ తేడియా సీతై | రంజిత | తమిళ | |
2009 | ఎవరైనా ఎప్పుడైనా | మధుమిత | తెలుగు | |
2010 | ఆప్తరక్షక | నాగవల్లి | కన్నడ | |
2010 | గాయం-2 | విద్య | తెలుగు | |
2010 | రంగ ది దొంగ | మంగమ్మ | తెలుగు | |
2011 | రాజ్ | ప్రియా | తెలుగు | |
2011 | చట్టం | సింది | తెలుగు | |
2011 | ధమ్ 999 | మీరా | ఇంగ్లీష్/మలయాళం | |
2012 | కులుమనాలీ | ప్రవల్లిక | తెలుగు | |
2012 | నువ్వా నేనా | విమలా రామన్ | తెలుగు | త త తామర పాటలో |
2013 | ముంబై మిర్రర్ | జియా | హిందీ | |
2013 | చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి | సమీరా | తెలుగు | |
2013 | అమెజాన్ టర్నింగ్ పాయింట్ | మడోన్నా | మలయాళం | |
2015 | రాజా రాజేంద్ర | విమలా రామన్ | కన్నడ | అతిధి పాత్ర |
2016 | పోయి మరంజు పరాయతే | స్వయంప్రభ | మలయాళం | |
2016 | ఒప్పం[5] | దేవయాని | మలయాళం | |
2017 | ఓం నమో వేంకటేశాయ | పద్మావతి దేవి | తెలుగు | |
2019 | ఇరుత్తు | జిన్ | తమిళ | |
2022 | గ్రాండ్ మా | ప్రియాంక | తమిళ్ | |
2023 | అశ్విన్స్ | ఆర్తి | తమిళ్, తెలుగు | |
2023 | రుద్రంగి | మీరా భాయ్ | తెలుగు | |
2023 | గాండీవదారి అర్జున | ప్రియా | తెలుగు | |
2024 | అంతిమ తీర్పు | తెలుగు |