విమి | |
---|---|
జననం | 1943[1] |
మరణం | 1977 ఆగస్టు 22 | (వయసు 33–34)
క్రియాశీల సంవత్సరాలు | 1967–1974 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటి |
విమి (1943 – 1977 ఆగస్టు 22) పంజాబ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. అబ్రూ, హమ్రాజ్,[2] పతంగా వంటి హిందీ సినిమాలలో నటించింది. సునీల్ దత్ నటించిన హమ్రాజ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
విమి 1943లో పంజాబ్ లోని జలంధర్ నగరంలో జన్మించింది.[1]
1967లో బిఆర్ చోప్రా దర్శకత్వం వహించిన హమ్‌రాజ్ సినిమాలో సునీల్ దత్ పక్కన నటించి సినిమారంగంలోకి అడుగుపెట్టింది. శశి కపూర్‌తో 1971లో పతంగ, 1974లో వచన్ మొదలైన సినిమాలలో నటించింది. 1968లో వచ్చిన ఆబ్రూ సినిమాలో దీపక్ కుమార్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. 1973లో వచ్చిన నానక్ నామ్ జహాజ్ హై అనే పంజాబీ సినిమాతో కూడా నటించింది. విమి నటించిన చివరి సినిమా క్రోధి, ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1977లో విడుదలైంది.[3]
ఆమెపై చిత్రీకరించిన పాటలు:
సంవత్సరం | సినిమాలు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1967 | హమ్రాజ్ | మీనా వర్మ | తొలిచిత్రం |
1968 | అబ్రూ | నీనా | |
1969 | నానక్ నామ్ జహాజ్ హై | చన్నీ | జాతీయ అవార్డు గెలుచుకున్న పంజాబీ సినిమా |
1971 | పతంగా | రేణు | |
1971 | గుడ్డి | అతిధి పాత్ర | |
1971 | కహిన్ ఆర్ కహిన్ పార్ | నర్తకి యువరాణి | |
1973 | కహానీ హమ్ సబ్ కీ | ||
1974 | వచన్ | ||
1978 | ప్రేమి గంగారాం | ||
1981 | క్రోధి |
విమి 1977, ఆగష్టు 22న నానావతి ఆసుపత్రిలోని సాధారణ వార్డులో కాలేయ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని తేల చేతి బండిలో శ్మశాన వాటికకు తరలించారు.[4]