వివేక్ ఆత్రేయ | |
---|---|
![]() | |
జననం | [1][2] | 1989 అక్టోబరు 18
విద్యాసంస్థ | శాస్త్ర విశ్వవిద్యాలయం |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
వివేక్ ఆత్రేయ, తెలుగు సినిమా దర్శకుడు. ఇతను తెలుగు క్రైమ్ కామెడీ సినిమా, బ్రోచేవారెవరురా, రొమాంటిక్ కామెడీ సినిమా మెంటల్ మదిలో సినిమాలకు దర్శకత్వం వహించాడు.
వివేక్ ఆత్రేయ 1989, అక్టోబర్ 18న గుంటూరులో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియా పోస్ట్‌లో పనిచేస్తున్నారు. శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వివేక్, చెన్నైలోని ఐబిఎంలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు. సినిమారంగంలోకి రావడంకోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[3][4]
2017లో రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో రొమాంటిక్ కామెడీ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
2017లో బ్రోచేవారెవరురా సినిమాను రూపొందించాడు. ఇందులో నివేదా థామస్, శ్రీవిష్ణు, సత్యదేవ్ కంచరాన, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ రెండు సినిమాలు విజయవంతమయ్యాయి.[5][6]
దర్శకత్వమేకాకుండా, తరుణ్ భాస్కర్ తీసినక ఈ నగరానికి ఏమైంది సినిమాకు వివేక్ ఆత్రేయ పాటలు (మారే కలలే, వీడిపోనిది ఒకటేలే) రాశాడు.
సంవత్సరం | సినిమాపేరు | దర్శకుడు | రచయిత | స్క్రీన్ ప్లే |
---|---|---|---|---|
2017 | మెంటల్ మదిలో | Yes | Yes | Yes |
2019 | బ్రోచేవారెవరురా | Yes | Yes | Yes |
2021 | అంటే సుందరానికి | Yes | Yes |