వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఢిల్లీ | 25 ఆగస్టు 1969|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కప్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 188) | 1989 నవంబరు 23 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 డిసెంబరు 9 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 73) | 1989 డిసెంబరు 18 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1990 డిసెంబరు 1 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4 |
వివేక్ రజ్దాన్ (జననం 1969 ఆగస్టు 25) 1989, 1990 మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్‌లు ఆడిన భారతీయ క్రికెటర్.[1][2][3] రిటైరైన తరువాత అతను, ఢిల్లీలో స్థిరపడి క్రికెట్ కోచ్‌గా, వ్యాఖ్యాతగా మారాడు.
అతను ఢిల్లీలో సెయింట్ కొలంబస్ స్కూల్‌లో చదివాడు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయ నుండి 1987లో 12వ తరగతి పూర్తి చేశాడు. [4] [5] చాలా కొద్దికాలం పాటు సాగిన టెస్టు కెరీర్‌లో వివేక్ రజ్దాన్, 1989 పాకిస్తాన్ పర్యటనలో భారతదేశం తరపున కేవలం రెండు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసాడు. వాటిలో రెండవ దానిలో ఐదు వికెట్లు తీసాడు. అయితే అతను వెలుగులోకి వచ్చినంత వేగంగా మరుగైపోయాడు. MRF పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందాక, 20 ఏళ్ల రజ్దాన్, దులీప్, ఇరానీ ట్రోఫీలలో కేవలం రెండు ఫస్ట్ క్లాస్ ప్రదర్శనల ఆధారంగా పాకిస్తాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో అనామకుడిగా ప్రవేశించి రజ్దాన్, తన ప్రతాపం చూపాడు. సియాల్‌కోట్‌లో జరిగిన చివరి టెస్టులో 5–79తో భారత్‌కు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించడంలో సహాయపడ్డాడు. [6]
రజ్దాన్ టెస్టు అవకాశాలు అంతటితో ముగిసాయి. న్యూజిలాండ్‌కు తదుపరి పర్యటనకు వెళ్ళినప్పటికీ, అతను టెస్టుల్లో ఆడలేదు. మొత్తం పర్యటనలో కేవలం ఒక ఫస్ట్ క్లాస్ వికెట్ మాత్రమే తీసుకున్నాడు. శ్రీలంకతో అతని మూడవ, చివరి ODI 90-91 సీజన్‌లో స్వదేశంలో జరిగింది. ఈ సమయంలో అతను MRF ట్రైనీగా మద్రాస్‌లో ఉన్నాడు. అతను రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించాడు. 1991–92లో రంజీ ట్రోఫీని గెలుచుకున్న ఢిల్లీ జట్టులో రజ్దాన్ కీలక సభ్యుడు. సర్వీసెస్‌పై కేవలం 96 బంతుల్లోనే రెండు సెంచరీలు చేశాడు. బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో తన మాజీ జట్టు తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో కీలకమైన 93 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు అతను 25.82 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. కానీ అతను త్వరలోనే అజ్ఞాతంలోకి జారిపోయాడు. అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ రెండు సీజన్ల తర్వాత ఫుల్ స్టాప్‌కి వచ్చింది. అప్పటి నుండి అతను టెలివిజన్ వ్యాఖ్యానాన్ని చేపట్టాడు.