విశాఖ మహా నగర పాలక సంస్థ
Viśākha Mahā Nagara Pālaka Samstha విశాఖ మహా నగర పాలక సంస్థ | |
---|---|
![]() | |
రకం | |
రకం | |
చరిత్ర | |
స్థాపితం | 1979[1] |
నాయకత్వం | |
జి. హరి వెంకట కుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | |
జి. శ్రీధర్ కె. సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | |
డాక్టర్ పి. సంపత్ కుమార్, ఐఏఎస్ | |
నిర్మాణం | |
సీట్లు | 98 |
![]() | |
రాజకీయ వర్గాలు | Government (47)
Opposition (48) |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 10 March 2021 |
తదుపరి ఎన్నికలు | 2026 |
నినాదం | |
City of Destiny | |
సమావేశ స్థలం | |
టేన్నేటి భవన్, రామ్‌నగర్, విశాఖపట్నం |
మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎమ్.సి), విశాఖపట్నం నగరాన్ని పాలించే ప్రధాన పరిపాలన సంస్థ. ఇది 540 చ. కి.మీ. (210 చ.మైళ్ళు) విస్తీర్ణ పరిధిలో ఉంది.[2] ఇది విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) ప్రణాళికా విభాగంలో ఒక భాగం.[3]
విశాఖపట్నం 1858 లో పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడి, 1979 లో నగరపాలకసంస్థగా అభివృద్ధి చేయబడింది. జాతీయ పట్టణ అభివృద్ధి పధకం ద్వారా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వ నిర్ణయంప్రకారం 2005 నవంబరు 21నాడు మహా నగరపాలక సంస్థగా మార్చబడింది.[4][5] విశాఖపట్నం చుట్టుపక్కల వున్న 32 గ్రామాలను, గాజువాక పురపాలక సంఘాన్ని ఇందులో విలీనం చేసారు.[6] 9.82 లక్షల జనాభా వున్న విశాఖ, ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసిన తరువాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది. ఈ విలీనం వల్ల 111 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించిన విశాఖ, 534 చ.కీ.మీ. విస్తీర్ణానికి పెరిగింది
(1) మధురవాడ, (2) పరదేశి పాలెం, (3) కొమ్మాది, (4) బక్కన్న పాలెం, (5) పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెం, (6) యారాడ (యారాడ మలుపు రోడ్డు ప్రమాదాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎల్లప్పుడూ 108 అంబులెన్స్ వుంటుంది), (7) గుడ్లవాని పాలెం, (8) ఎల్లపువాని పాలెం, (9) వేపగుంట, (10) పురుషోత్తమపురం, (11) చిన్న (చిన) ముసిడివాడ, (12) పులగాలిపాలెం, (13) పెందుర్తి, (14) లక్ష్మీపురం, (15) పొర్లుపాలెం, (16) నరవ, (17) వెదుళ్ళ నరవ, (18) సతివానిపాలెం, (19) నంగినారపాడు, (20) గంగవరం (పోర్టు వుంది), (21) ఇ.మర్రిపాలెం, (22) లంకెల పాలెం, (23) దేశపాత్రునిపాలెం, (24) దువ్వాడ (రైల్వే స్టేషను వుంది), (25) అగనంపూడి (ఆల్ ఇండియా రేడియో స్టేషను వుంది), (26) కె.టి.నాయుడిపాలెం, (27) దేవాడ, (28) పాలవలస, (29) చిన్నిపాలెం, (30) అప్పికొండ (సోమేశ్వరాలయం ప్రసిద్ధి) (31) అడివివరం (32) మంత్రి పాలెం.
2011 జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ జనాభా 20,91,811 గా ఉంది.[7]
Sno. | మేయర్ | డిప్యూటీ మేయర్ | చిత్తరువు | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | వ్యవధి | పార్టీ | గామనికలు | Ref. | |
---|---|---|---|---|---|---|---|---|---|---|
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (VMC)) | ||||||||||
1. | ఎన్.ఎస్.ఎన్.రెడ్డి | 1981 | 1986 | 5 years | భారతీయ జనతా పార్టీ | విశాఖపట్నం మొదటి మేయర్ | [8] | |||
Elections not held (1986 - 1987) | ||||||||||
2. | డి. వి. సుబ్బారావు | 1987 | 1992 | 5 years | తెలుగుదేశం పార్టీ | [9] | ||||
Elections not held (1992 - 1995) | ||||||||||
3. | సబ్బం హరి | 1995 | 2000 | 5 years | భారత జాతీయ కాంగ్రెస్ | [10] | ||||
4. | రాజన రమణి | మళ్ల అప్పల రాజు | 2000 | 2005 | 5 years | విశాఖపట్నం కి తొలి మహిళా మేయర్ | [11] | |||
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) | ||||||||||
ఎన్నికలు జరగలేదు (2005 - 2007) | ||||||||||
1. | పి.జనార్ధన్ | కె. దొరబాబు | 2007 | 2012 | 5 years | భారత జాతీయ కాంగ్రెస్ | జీవీఎంసీ తొలి మేయర్ | [12] | ||
ఎన్నికలు జరగలేదు (2012 - 2021) | ||||||||||
2. | గోలగాని హరి వెంకట కుమారి | జె. శ్రీధర్ కె. సతీష్ |
2021 | అధికారంలో ఉన్న | ప్రస్తుతం | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | జీవీఎంసీ తొలి మహిళా మేయర్ | [13] |
మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రాంత విస్తీర్ణం మొత్తం 681.96 చ.కి.మీ. (263.31 చ.మైళ్ళు). మేయర్ నేతృత్వంలోని ఒక ఎన్నికైన సంస్థచే నగర పాలక సంస్థ నిర్వహణలో ఉంది. 2021 జనవరి 21 నాటికి వార్డుల సంఖ్య 81 నుండి 98 కి పెరిగింది[14] సంస్థ పరిపాలన కొరకు 11 విభాగాలున్నాయి. రెవెన్యూ శాఖ, అక్కౌంట్సు (పద్దులు) శాఖ, సాధారణ పరిపాలన, బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం), ఇంజినీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు ), టౌన్ ప్లానింగ్ శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర అభివృద్ధి సంస్థ), విద్యా శాఖ, ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలించి, తప్పులను, అనవసరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది), లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానాలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది). ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి (కమీషనరు, ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు. విశాఖపట్నం నగర అభివృద్ధి కొరకు విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేయబడింది.
జివిఎంసిని 8 జోన్లుగా విభజించారు, ప్రతి జోన్‌కు ఒక జోనల్ కమిషనర్ ఉన్నారు. [15]
జోన్ | Location |
---|---|
జోన్ 1 | భీమునిపట్నం |
జోన్ 2 | మధురవాడ |
జోన్ 3 | అసీల్‌మెట్ట |
జోన్ 4 | సూర్యబాగ్ |
జోన్ 5 | జ్ఞానాపురం |
జోన్ 6 | గాజువాక |
జోన్ 7 | అనకాపల్లి |
జోన్ 8 | వేపగుంట |
S.No. | పార్టీ పేరు | పార్టీ చిహ్నం | గెలిచింది | మార్పు | |
---|---|---|---|---|---|
1 | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | ![]() |
58 | 0 | |
2 | తెలుగుదేశం పార్టీ | ![]() |
30 | 0 | |
3 | స్వతంత్రులు | 4 | 0 | ||
4 | జనసేన పార్టీ | ![]() |
3 | 0 | |
5 | భారతీయ జనతా పార్టీ | ![]() |
1 | 0 | |
6 | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ![]() |
1 | 0 | |
7 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | ![]() |
1 | 0 |
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)