విశాల్ ఉప్పల్ (జననం 1976 నవంబరు 10) భారతదేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడు. అతను 2000, 2002 లలో డేవిస్ కప్‌లో పాల్గొన్నాడు [1]
అతను చిన్న పిల్లవాడిగా ఉండగా పాఠశాలలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 11 సంవత్సరాల వయస్సులో టెన్నిస్‌కు మారాడు. అతను పాఠశాలలో ఉండగా ఫాదర్ ఓ'బ్రియన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడి, సెమీఫైనల్స్‌లో ఓడిపోయాడు. అది ఆట పట్ల అతని ఆసక్తిని, పట్టుదలనూ పెంచింది. 2002లో, అతను డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ముస్తఫా ఘౌస్‌తో కలిసి పురుషుల డబుల్స్ కాంస్యాన్ని గెలుచుకున్నాడు.[2] అతను 2000, 2002[3] లలో డేవిస్ కప్‌లో ఆడాడు.
అతను శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి పట్టభద్రుడయ్యాడు. జూనియర్ డేవిస్ కప్‌లోని విద్యార్థులతో సహా[4] టెన్నిస్‌లో ఇతర విద్యార్థులకు కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతను జూనియర్ AITA ఎంపిక కమిటీలో కూడా సభ్యుడు.[5][6]