విశ్వరూపం | |
---|---|
దర్శకత్వం | కమల్ హాసన్ |
రచన | కమల్ హాసన్ అతుల్ తివారి |
నిర్మాత | కమల్ హాసన్, చంద్రహాసన్ |
తారాగణం | కమల్ హాసన్ పూజా కుమార్ ఆండ్రియా రాహుల్ బోస్ జైదీప్ అహ్లావత్ జరీనా వహాబ్ |
ఛాయాగ్రహణం | సాను వర్ఘీస్ |
కూర్పు | మహేశ్ నారాయణన్ |
సంగీతం | శంకర్-ఎహసాన్-లాయ్ |
పంపిణీదార్లు | పి.వి.పి ఫిలింస్ |
విడుదల తేదీs | 25 జనవరి 2013 (తెలుగు, హిందీ), 7 ఫిబ్రవరి 2013, (తమిళం) |
సినిమా నిడివి | 147 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళ్, హిందీ |
బడ్జెట్ | ₹95 crore (US$12 million)[2][3] |
విశ్వరూపం 2013 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆలస్యంగా , ఫిబ్రవరి 7 న విడుదలవనున్నది.[4]
విశ్వనాధ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. ఆయన భార్య డాక్టర్ నిరుపమ (పూజా కుమార్) విశ్వనాధ్ మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఏజెంట్ సహాయం కోరుతుంది. ఆ డిటెక్టివ్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం విశ్వనాధ్ హిందూ కాదని ముస్లిం అని తెలుస్తుంది. విశ్వనాధ్ పట్టుకునే క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం టెర్రరిస్ట్ ఒమర్ (రాహుల్ బోస్) కి దొరికిపోతాడు. ఆ క్రమంలో విశ్వనాధ్ ఎవరు అని కనుక్కునే ప్రయత్నంలో విశ్వనాధ్ గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు విశ్వనాధ్ ఎవరు? అతనికి టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? ఇంతకు విశ్వనాధ్ మంచి వాడా? చెడ్డవాడా? ఇది విశ్వరూపం యొక్క కథ.