విశ్వాసం | |
---|---|
దర్శకత్వం | శివ |
రచన | రాజేష్ ఏ.మూర్తి |
కథ | ఆదినారాయణ, శివ |
నిర్మాత | సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వెట్రి పళనిస్వామి |
కూర్పు | రూబెన్ |
సంగీతం | డి.ఇమాన్ |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 1 మర్చి 2019 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విశ్వాసం 2019లో తమిళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజిత్, నయనతార, జగపతి బాబు, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 మర్చి 2019న విడుదలైంది.[1]
రావులపాలెం గ్రామంలో వీర్రాజు (అజిత్) రైస్ మిల్లు ఓనర్. ఆ ఊరికి మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చిన నిరంజన (నయనతార)ను చూసి ఇష్ట పడి పెళ్లి చేసుకుంటాడు అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోతారు. తమ గ్రామంలో పదేళ్లకోసారి జరగే జాతర జరుగుతుంది. ఈసారి జాతరకి బంధువుల్లేక వొంటరిగా వున్న వీర్రాజుని ఇప్పటికైనా వెళ్ళి భార్యనీ, కూతుర్నీ తీసుకురమ్మని వారి పెద్దలు చెప్తారు. వీర్రాజు ముంబాయి వెళ్లి భార్య డాక్టర్ నిరంజన (నయనతార) ని కలుసుకుంటాడు. ఇంతకీ వీర్రాజు భార్య అతడిని విడిచి ఎందుకు వెళ్లిపోయింది? ముంబయి వెళ్లిన అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తిరిగి ఆమెను తన ఊరికి తీసుకురావడానికి అతనేం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)