వీడు | |
---|---|
![]() వీడు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | బాలు మహేంద్ర |
రచన | బాలు మహేంద్ర |
కథ | అఖిల మహేంద్ర |
నిర్మాత | కళాదాస్ |
తారాగణం | అర్చన భానుచందర్ చంద్రమోహన్ |
ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
కూర్పు | బాలు మహేంద్ర |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సాయికళా ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 1988 |
సినిమా నిడివి | 108 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
వీడు, 1988లో విడుదలైన తమిళ సినిమా. సాయికళా ఇంటర్నేషనల్ బ్యానరులో కళాదాస్ నిర్మాణంలో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన, భానుచందర్, చంద్రమోహన్ ప్రధాన పాత్రలో నటించారు.[1] ఒక మధ్యతరగతి కుటుంబం తన ఇంటిని నిర్మించడానికి చేసే ప్రయత్నంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రూపొందింది. ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు స్క్రిప్ట్, ఫోటోగ్రాఫ్, ఎడిటింగ్ విభాగాల్లో కూడా బాలు మహేంద్ర పనిచేసాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. 1987లో జరిగిన 35వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి (అర్చన), ఉత్తమ తమిళ చిత్రం అవార్డులు వచ్చాయి.[2] 12 లక్షల బడ్జెట్తో రూపొంది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 72 లక్షలు వసూలు చేసింది.[3]
1988లో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో "ఇండియన్ పనోరమా" విభాగంలో ప్రదర్శించబడిన 16 సినిమాలో ఇదీ ఒకటి.[4] బాలు మహేంద్ర తమిళ సినిమా విభాగంలో ఉత్తమ దర్శకుడిగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డును గెలుచుకున్నాడు.[5] 2002లో లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఇండియన్ సమ్మర్" విభాగంలో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది.[6]