వీడే | |
---|---|
![]() | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
రచన | ధరణి |
స్క్రీన్ ప్లే | కోన వెంకట్ (సంభాషణలు) |
నిర్మాత | సింగనమల రమేష్ |
తారాగణం | రవితేజ, ఆర్తి అగర్వాల్ |
కూర్పు | హరిశంకర్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | కనకరత్న మూవీస్ |
పంపిణీదార్లు | కె. ఎస్. రామారావు ఫిలింస్ |
విడుదల తేదీ | 31 అక్టోబరు 2003 |
సినిమా నిడివి | 180 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వీడే 2003లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] రవితేజ, ఆర్తి అగర్వాల్ ఇందులో ప్రధాన పాత్రధారులు.
బొబ్బర్లంక అనే గ్రామంలో ప్రజలు కాలుష్యం వలన తాగునీటికి బాగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం ఆ ఊరికి సమీపంలో ఉన్న కర్మాగారం నుంచి అక్రమంగా వెలువడే వ్యర్థాలు ప్రజలు తమ అవసరాలకు వాడే నీటిలో కలవడం. గ్రామంలో ప్రజలంతా ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని పరిశ్రమకు వ్యతిరేకంగా పై అధికారులకు నివేదించాలనుకుంటారు. ఆ గ్రామంలో ఏడుకొండలు అనే యువకుడు ఈ సమస్యను తమ ప్రజా ప్రతినిధియైన బత్తుల బైరాగి నాయుడికి నివేదించడానికి పట్నం వస్తాడు. అక్కడ అతనికి ఘోరమైన అవమానం ఎదురవుతుంది. తనను, తన గ్రామాన్ని అవమానించిన బైరాగి నాయుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తీర్మానించుకుంటాడు ఏడుకొండలు. తన తెలివితేటలతో, స్వప్న అనే జర్నలిస్టు సహాయంతో బైరాగి నాయుడు పదవి ఊడేలా చేస్తాడు. తమ గ్రామ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళేలా చేస్తాడు. బైరాగి నాయుడు ఆసుపత్రిలో ఉన్న ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నిస్తే ఏడుకొండలు వచ్చి కాపాడతాడు. తమ ఊరి సమస్యను పరిష్కరించి గ్రామానికి తిరిగి వెళ్ళడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమాలో పాటలన్నీ చక్రి స్వరపరిచాడు. తెలంగాణా శకుంతల అడుగడుగో వస్తున్నాడు వీర భయంకరుడే అనే పాట పాడింది.[2]