వీర సామ్రాజ్యం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | చెరుకూరి ప్రకాశరావు |
తారాగణం | జెమినీ గణేశన్, వైజయంతిమాల, ఎస్.వి.రంగారావు |
సంగీతం | పామర్తి |
సంభాషణలు | మల్లాది రామకృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | నరసరాజు కంపెనీ |
భాష | తెలుగు |
వీర సామ్రాజ్యం తమిళం నుండి డబ్బింగ్ అయిన తెలుగు సినిమా. కల్కి కృష్ణమూర్తి తమిళంలో వ్రాసిన చారిత్రక నవల పార్తీబన్ కనవు ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఈ జానపద/చారిత్రాత్మక చిత్రం 1961, ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. పగవాని కుమారునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన విశాలహృదయుడు పల్లవ చక్రవర్తి నరసింహ వర్మ కథ ఇది. ఈ సినిమాను మహాబలిపురంలో చిత్రీకరించారు[1]. ఈ సినిమా తమిళంలో పార్తీబన్ కనవు పేరుతో విడుదలై రజతోత్సవం జరుపుకొనడమే కాక 1960 వ సంవత్సరానికి గాను ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.