వీర సింహా రెడ్డి | |
---|---|
![]() | |
దర్శకత్వం | గోపీచంద్ మలినేని |
రచన | గోపీచంద్ మలినేని |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | మైత్రీ మూవీ మేకర్స్ |
విడుదల తేదీs | 12 జనవరి 2023(థియేటర్) 23 ఫిబ్రవరి 2023 ( డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 70 కోట్లు[2] |
వీర సింహా రెడ్డి 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్,హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 5 విడుదల చేయగా[3], సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదలైంది.[4]
రాయలసీమలో పులిచర్ల ప్రజలకు దేవుడు వీరసింహారెడ్డి (నందమూరి బాలకృష్ణ). ఆ ఊరికి ఏ కష్టమొచ్చిన ముందుటాడు. జై (నందమూరి బాలకృష్ణ) అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో కలిసి ఇస్తాంబుల్‌లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అతనికి ఈషా (శృతి హాసన్) అనే అమ్మాయి పరిచయమై.. ఆ పరిచయం పెళ్ళి వరకు వెళుతుంది. ఈషా తండ్రి (మురళీ శర్మ) ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. మీనాక్షి కబురు చేయగానే సీమ నుండి వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అతనిని వెతుక్కుంటూ ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), అతని భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ఇస్తాంబుల్ వచ్చి వీరసింహారెడ్డిపై దాడి చేస్తారు. వీరసింహారెడ్డికి చెల్లెలైన భానుమతి వీరసింహారెడ్డిని ఎందుకు చంపాలని అనుకుంటుంది? మీనాక్షి ఇస్తాంబుల్‌లో ఎందుకుంది? ప్రతాప్ రెడ్డికి వీరసింహారెడ్డికి మధ్య పగకు కారణమేంటి ? అనేదే మిగతా సినిమా కథ.[5]
పాట | గీత రచయిత | గాయకులు |
మాస్ మొగుడు[8] | రామజోగయ్య శాస్త్రి | మనో, రమ్య బెహరా |
మా బావ మనోభావాలు | రామజోగయ్య శాస్త్రి | చంద్రికా రవి |
సుగుణ సుందరి[9] | రామజోగయ్య శాస్త్రి | రామ్ మిరియాల, స్నిగ్ధ |
జై బాలయ్య మాస్ ఆంథమ్ | రామజోగయ్య శాస్త్రి |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)