వీరు పోట్ల | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు & రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2004 - ప్రస్తుతం |
వీరు పోట్ల భారతదేశ చలనచిత్ర స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు. అతను ప్రాథమికంగా తెలుగు సినిమాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను బిందాస్, రగడ సినిమాలకు దర్శకునిగా సుపరిచితుడు. అతను స్క్రీన్ ప్లే అందించిన చిత్రాలలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లు ముఖ్యమైనవి.
వీరు పోట్ల ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. పిదుగురాళ్లలో ప్రాథమిక, సెకండరీ విద్యను, పూర్తిచేసాడు. అతనికి సినిమా రంగంపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. అందువలన హైదరాబాదుకు చేరి స్క్రీన్ రచయితగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అతను రాజమండ్రిలో సినిమా రంగ అనుభవం లేని కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.[1] అతనికి నచ్చిన దర్శకులు కె.విశ్వనాథ్, వుడీ అలెన్ లు.[2]
అతను 2004లో ప్రభాస్ కథానాయకునిగా విడుదలైన వర్షం చిత్రం ద్వారా స్క్రీన్ రచయితగా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో సిద్ధార్థ, త్రిష తారాగణంగా ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన నువ్వొస్తానంటే నే వద్దంటానా చిత్రం అతని రెండవ చిత్రం. 2010లో మంచు మనోజ్ కథానాయకునిగా విడుదలైన బిందాస్, అక్కినేని నాగార్జున నటించిన రగడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు చిత్రాలు అనుకూల సమీక్షలను పొందాయి.[3][4] అతను దర్శకత్వం వహించిన చిత్రం దూసుకెళ్తా అనుకూల సమీక్షలను పొంది బాక్సాఫీస్ హిట్ చిత్రంగా గుర్తింపు పొందింది. [5]