వీరేంద్ర ప్రభాకర్ | |
---|---|
జననం | ఉత్తర ప్రదేశ్, బ్రిటిషు భారతదేశం | 1928 ఆగస్టు 15
మరణం | 2015 జనవరి 4 న్యూ ఢిల్లీ | (వయసు: 86)
వృత్తి | ఫొటో పాత్రికేయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1947–2015 |
వీటికి ప్రసిద్ధి | వార్తల ఫొటోలు |
జీవిత భాగస్వామి | కాంత |
పిల్లలు | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
పురస్కారాలు | పద్మశ్రీ ఢిల్లీ రాష్ట్ర పురస్కారం AIFACS వారి కళా విభూషణ్ పురస్కారం అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ పురస్కారం రోటరీ ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2000 ఆచార్య మహాప్రజ్ఞ అహింసా ప్రశిక్షణ్ సమ్మాన్ |
వీరేంద్ర ప్రభాకర్ (1928 ఆగస్టు 15 - 2015 జనవరి 4) ప్రెస్ ఫోటో జర్నలిస్టు. అత్యధిక కాలం పనిచేసిన ప్రెస్ ఫోటో జర్నలిస్ట్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.[1] 14,458 వార్తల ఫోటోలు అతని పేరిట ఉన్నాయి.[2] భారత ప్రభుత్వం అతనికి 1982లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది [3]
వీరేంద్ర ప్రభాకర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జైన కుటుంబంలో 1928 ఆగస్టు 15 న జన్మించాడు. డూన్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. అక్కడే ఆర్ట్స్ ఫ్యాకల్టీగా ఉన్నసుధీర్ ఖస్త్‌గిర్ వద్ద శిల్పకళ, ఫోటోగ్రఫీలో శిక్షణ పొందే అవకాశం లభించింది.[4] ఆ తర్వాత ముస్సోరీలోని చిత్రశాలలో చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు.[5] భారతదేశం స్వాతంత్ర్యానికి పరివర్తన దశలో ఉన్నందున 1947లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించిన ఆసియా సంబంధాల కాన్ఫరెన్స్ను కవర్ చెయ్యడంతో తన కెరీర్ మొదలుపెట్టాడు.[5] ఢిల్లీలోని పాత కోటలో జరిగిన సదస్సుకు మహాత్మా గాంధీ, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్ణో హాజరైనపుడు, ఆ సదస్సును ప్రభాకర్ కవర్ చేశాడు.
1947 నుండి 2015 లో మరణించే వరకు అతను 14,458 ప్రచురించిన వార్తా ఫోటోలకు గాను ఎక్కువ కాలం పనిచేసిన ఫోటో జర్నలిస్ట్‌గా ప్రభాకర్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.[2] అతని ఫోటోలను అనేక హిందీ, ఇంగ్లీషు దినపత్రికలు ప్రచురించాయి. వివిధ ఇతివృత్తాలపై అతని ఫోటో ప్రదర్శనలు చాలా ప్రదేశాలలో ప్రదర్శించబడ్డాయి. ఢిల్లీలో కళ, సంస్కృతిని ప్రోత్సహించే చిత్ర కళా సంఘానికి అతను వ్యవస్థాపక కార్యదర్శి.[5]
ప్రభాకర్ కాంత [4] ని వివాహం చేసుకున్నాడు. ఈ జంట ఢిల్లీలోని బాపా నగర్‌లో నివసించారు.[6] వారికి ఒక కుమార్తె, నీలం, అశోక్ జైన్, రవి జైన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి జైన్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. [2] ప్రభాకర్ 2015 జనవరి 4 న 86 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఢిల్లీలో మరణించాడు.[6][7]
1982 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రదానం చేసింది. [3] దీని తర్వాత ఢిల్లీ స్టేట్ అవార్డ్, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అతనికి 2000 లో మిలీనియం 2000 కళా విభూషణ్ అవార్డును అందించింది. అదే సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ నుండి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. [5] 2006 లో అతను ఆచార్య మహాప్రజ్ఞ అహింసా సంరక్షణ సమ్మాన్‌ని అందుకున్నాడు.[8]