వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మేర్లపాక గాంధీ |
---|---|
నిర్మాణం | జెమిని కిరణ్ |
కథ | మేర్లపాక గాంధీ |
చిత్రానువాదం | మేర్లపాక గాంధీ |
తారాగణం | సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్, సప్తగిరి, తాగుబోతు రమేశ్, నాగినీడు, బ్రహ్మాజీ |
సంగీతం | రమణ గోగుల |
నేపథ్య గానం | రంజిత్, శ్వేతా మోహన్, అంజనా సౌమ్య, నరేంద్ర, శ్రావణ భార్గవి |
నృత్యాలు | శేఖర్ వి.జె. |
గీతరచన | భాస్కరభట్ల రవికుమార్, శ్రీ మణి, కాసర్ల శ్యాం |
సంభాషణలు | మేర్లపాక గాంధీ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | గౌతం రాజు |
నిర్మాణ సంస్థ | ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ |
పంపిణీ | ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ 2013లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రము.[1] ఇందులో సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు.[2]
సందీప్ (సందీప్ కిషన్) తండ్రి (నాగినీడు) ఎవరు తప్పులు చేసినా కానీ సహించడు. తన ఇంట్లో వాళ్లకి కూడా తప్పుల జాబితా తయారు చేసి, వంద తప్పులు చేసిన వెంటనే వాళ్లని ఇంట్లోనుంచి బహిష్కరిస్తాడు. అయితే ఆపదలో ఎవరు ఉన్నా సాయం చేసే అలవాటున్న సందీప్ తన తండ్రి దృష్టిలో 99 తప్పులు పూర్తి చేస్తాడు. మరో తప్పు చేస్తే అతడిని ఇంటినుంచి పంపేస్తారు. ఆ సమయంలోనే తన అన్నయ్య పెళ్ళి కోసమని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం కుటుంబమంతా బయల్దేరుతుంది. కానీ సందీప్ రైలు అందుకోలేకపోతాడు. అతని వద్దే తాళిబొట్టు ఉండిపోవడంతో ఎలాగైనా రైలు ఎక్కడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.
రైట్ అయినా లెఫ్ట్ అయినా, రచన: శ్రీమణి, గానం. రంజిత్
మెల్ల మెల్లగా, రచన: కాసర్ల శ్యామ్, గానం . శ్వేతా మోహన్ , అంజనా సౌమ్య
నచ్చేవే అమ్మక చెల్లో, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నరేంద్ర , శ్రావణ భార్గవి