వెంకటాపురం | |
---|---|
దర్శకత్వం | వేణు మదికంటి |
నిర్మాత | తూము ఫణికుమార్ శ్రేయస్ శ్రీనివాస్ |
తారాగణం | రాహుల్ మహిమా అజయ్ ఘోష్ |
ఛాయాగ్రహణం | సాయిప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | మధు |
సంగీతం | అచ్చు |
నిర్మాణ సంస్థలు | గుడ్ సినిమా గ్రూప్ బాహుమన్య ఆర్ట్స్ |
విడుదల తేదీ | 12 మే 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వెంకటాపురం 2017లో విడుదలైన తెలుగు సినిమా. గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్‌పై తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకత్వం వహించాడు. రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 12 మే 2017న విడుదలైంది.[1]
పిజ్జా షాప్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్(రాహుల్) తన అపార్ట్మెంట్ కు కొత్తగా వచ్చిన చైత్ర (మహిమా మక్వాన్)తో ప్రేమలో పడతాడు. ఆనంద్ జీవితంలోకి వచ్చిన చైత్ర హత్యకు గురవుతుంది. వీరిద్దరి జీవితంలో అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏమిటి ? చైత్రను హత్య చేసిందెవరు ? ఈ మర్డర్ మిస్టరీ ని పోలీస్ ఆఫీసర్ అజయ్ (అజయ్) ఎలా ఛేదించాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2]
పాట | గాయకులు | రచయిత |
---|---|---|
ఎగిరే | కేక ఘోషల్, యజిన్ నిజార్ | వనమాలి |
ఓ మాయ | బెన్నీ దయాల్ | అనంత శ్రీరామ్ |
కొక్కొరొకో | సత్య యామిని, శృతి, రఘురాం, శ్రీ కృష్ణ, దీపు | అనంత శ్రీరామ్ |
తానెవరో | అచ్చు | అనంత శ్రీరామ్ |
కాలం | ధనుంజయ్, సాయి శిల్ప | అనంత శ్రీరామ్ |
తానెవరో | విజయ్ ఏసుదాస్ | అనంత శ్రీరామ్ |