![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బాపూ కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బెంగళూరు, మైసూరు రాష్ట్రం | 1969 ఆగస్టు 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.91 మీ. (6 అ. 3 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 204) | 1996 జూన్ 7 - ఇంగ్లండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 ఆగస్టు 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 89) | 1994 ఏప్రిల్ 2 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 అక్టోబరు 17 - కెన్యా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–2003 | కర్ణాటక రాష్ట్ర జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2017 సెప్టెంబరు 2 |
వెంకటేష్ ప్రసాద్ (జ. 1969 ఆగస్టు 5)[1] భారత మాజీ క్రికెట్ ఆటగాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో బెంగుళూరులో జన్మించిన వెంకటేష్ ప్రసాద్ 1994 లో తన కెరీర్ మొదలు పెట్టాడు. ప్రసాద్ ప్రధానంగా కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్. జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ తో కలిసి కొంతకాలం భారత జట్టులో మంచి జోడీగా పేరుపొందారు.[2] ప్రసాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ XI పంజాబ్ కి బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. 2007 నుంచి 2009 మధ్యలో భారత క్రికెట్ జట్టుకి కూడా బౌలింగ్ కోచ్ గా సేవలందించాడు.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రసాద్ మొత్తం 33 టెస్టులాడి 35 సగటున 96 వికెట్లు తీశాడు. 161 వన్డేలు ఆడి 32.3 సగటుతో 196 వికెట్లు తీశాడు.
వెంకటేష్ ప్రసాద్ పూర్తి పేరు బాపు కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్. 1969 ఆగస్టు 5న అప్పటి మైసూరు రాష్ట్రం, బెంగళూరులో జన్మించాడు.
1996 ఏప్రిల్ 22 న తనకన్నా వయసులో పెద్దదైన జయంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పృథ్వి అనే కుమారుడు ఉన్నాడు.[3]