వెన్నా సరస్సు | |
---|---|
ప్రదేశం | మహాబలేశ్వర్, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 17°56′02″N 73°39′54″E / 17.934°N 73.665°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 4 కి.మీ. (2.5 మై.) |
గరిష్ట వెడల్పు | 1.5 కి.మీ. (0.93 మై.) |
సరాసరి లోతు | 80 అ. (24 మీ.) |
గరిష్ట లోతు | 120 అ. (37 మీ.) (మధ్యలో) |
వెన్నా సరస్సు భారతదేశంలోని మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ అనే ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో ఉంది. ఈ సరస్సు 1842 లో సాతారా రాజు అయిన శ్రీ అప్పాసాహెబ్ మహరాజ్ చేత నిర్మించబడింది.
సరస్సు చుట్టూ చాలా రకాల చెట్లు ఉన్నాయి. పర్యాటకులు సరస్సు మీదుగా పడవ ప్రయాణం లేదా సరస్సు పక్కన గుర్రపు స్వారీని ఆస్వాదించవచ్చు. సరస్సు ఒడ్డున అనేక చిన్న చిన్న తినుబండారాలు ఉన్నాయి. మహాబలేశ్వర్ సిటీ మార్కెట్, S.T. బస్ స్టాండ్ సరస్సు నుండి 2 కిమీ (1.2 మైళ్ళు) దూరంలో ఉన్నాయి.[1]