ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, కమ్మ కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. అయితే ఇవి అన్ని కేవలం ఊహలు మాత్రమే వీటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. వెలమ అను పదము మొదటిసారిగా నెల్లూరు మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి (గుంటూరు మండలములోని ఒక భాగము) తెలంగాణకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు.
11వ శతాబ్దములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండి ఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు.[1][2] వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు."....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
వెలమలు నేత , అద్దకం వ్యాపారాన్ని చేపట్టారు, వారిలో కొందరు సైనిక వృత్తిలో నిమగ్నమై ఆస్తిని సంపాదించారు. వారు ఇప్పుడు భూస్వాములు, సాగుదారులు , పశువుల పెంపకందారులు, మరికొందరు రంగులు వేసి బట్టలు నేస్తారు. వారు తమను తాము కూలీ కార్మికులుగా చేయరు , వారి మహిళలు అలా చేయరు,పొలాల్లో పని చేస్తారు[3].వెలమలు , పద్మ వెలమలు వేర్వేరు సంఘాలు.బలిజలు వెలమలను గుని-సాకల్ వాండ్లు లేదా హంచ్ బ్యాక్డ్ వాషర్మాన్ అని పిలుస్తారు,ఎందుకంటే వారిలో కొందరు చింట్జ్‌ని ప్రింట్ చేస్తారు , తమ వస్తువులను తమ వెనుక భాగంలో ఒక కట్టలో ఉంచుతారు[4].ఈ కులానికి చెందిన వ్యక్తి పొడుగ్గా , బలంగా ఉంటాడు, తులనాత్మకంగా సరసమైన రంగు , బోల్డ్ , అహంకార ప్రవర్తన కలిగి ఉంటాడు[4]
రాచ వెలమలు మొత్తం వెలమ కులంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించగా, అద్దకం కుండను ఉపయోగించే గుణ వెలమ,'ఏకు' లేదా కాటన్ స్కీన్ నేత కార్మికులు , కార్డర్‌లు , తెల్లకు లేదా తెల్ల ఆకు వెలమలు, ఈ ఇంటిపేరు యొక్క ప్రాముఖ్యత తెలియదు[4]
చాలా మంది కంగనీ వలసదారులు గవర , వెలమల నుండి వచ్చారు,వెలమలలో ధనికులు వెలమ దొర అని కూడా పిలుస్తారు.[6]
వెలమ వితంతువుల పునర్వివాహం నిషేధించబడింది , స్త్రీలు గోషా (ఏకాంతంలో) ఉండి, కొప్పుల వెలమలకు భిన్నంగా రెండు మణికట్టుకు వెండి లేదా బంగారు కంకణాలను ధరిస్తారు.వెలమలు ఎల్లప్పుడూ మాల జంటలు వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు, వారి ఇళ్లలో వివాహం జరగడానికి ముందు, , వారు మాల వివాహానికి అవసరమైన నిధులను అందిస్తారు. నిధిని పొందడం కోసం వెలమ తనను బలి ఇవ్వడానికి ఒక మాల ఒకసారి అనుమతించిందని వారు కథనాన్ని వివరిస్తారు. ఈ ఆచారం మొదలైంది.[7]
కాకతీయులకు పూర్వకాలములో రేచెర్ల వంశమునకు చెందిన వారు పలనాటి సీమలో కాలచూరి వంశమునకు చెందిన హైహయ రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు. మాచెర్లను పాలించిన అలుగు రాజు వద్ద దొడ్డ నాయుడు ఆతని కుమారుడు బ్రహ్మ నాయుడు మంత్రులుగా ఉన్నారు. దాయాదుల మధ్య జరిగిన పోరులో బ్రహ్మ నాయుడు మలిదేవరాజు పక్షమున పోరాడి ఓడిపోతాడు. బ్రహ్మనాయుని సాంఘిక సంస్కరణలు తెలుగువారికి సువిదితములే. ఎట్టి చారిత్రకాధారాలు లేకపోయిననూ పల్నాటి యుద్ధం తెలుగు సాహిత్య, సంప్రదాయములలో స్థిరముగా నిలిచిపోయిన వాస్తవ సంఘటన. పల్నాటి యుద్ధం కారణముగా పెక్కు రాజవంశాలు (తెలుగుచోళులు, హైహయులు, హోయసాలులు, కోట వంశస్థులు) బలహీనపడినవి. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఈ పరిస్థితులు అనుకూలమయ్యాయి.
కాకతీయుల కాలములో వెలమలు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. రేచెర్ల ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవికి అండదండలు అందించినట్టు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది. రేచెర్ల వెన్న, పోతుగంటి మైలి క్రీ. శ. 1303 లో అలాఉద్దీను ఖిల్జీ సైన్యముతో ఉప్పరపల్లి వద్ద తలపడి వారిని తరిమివేశారు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది. రేచెర్ల సింగమ నాయుడు ప్రతాపరుద్రుని ప్రముఖ సేనానులలో ఒకడు.
సింథియా టాల్బోట్ సిద్ధాంతము ప్రకారము పద్మనాయకు లందరూ వెలమలు కారనియూ, వారిలోని రేచెర్ల వంశమువారే వెలమలనియూ వాదన.[8] భీమేశ్వర పురాణము లో శూద్రులలో శాఖలుగా 'వెలమలు' 'పద్మనాయకులు' వేర్వేరుగా చెప్పబడిరి. అటులనే ఒక తెలంగాణా శాసనములో (క్రీ. శ. 1613) ఒకనిని వెలమగా మరొకనిని పద్మనాయకునిగా పరిగణించబడిరి. దీనిని బట్టి పద్మనాయకులలో మహాయోధులైన పలు కులముల వారున్నారని చెప్పవచ్చును.
"....అందు పద్మనాయకులన, వెలమలన, కమ్మలన త్రిమార్గ గంగాప్రవాహంబులుంబోలె గొత్రంబులన్నియేని జగత్పవిత్రంబులై ప్రవహింపచుండ".[9]
రాచకొండ రాజు రేచెర్ల సింగమ నాయకుడు తొలుత ముసునూరి కమ్మ నాయకుల నాయకత్వము క్రింద తురుష్కులను తెలంగాణము నుండి తరిమివేయుటకు తోడ్పడ్డాడు. ముసునూరి కాపానీడు ఓరుగల్లు పాలకునిగా స్థిరపడిన పిమ్మట విభేదములు తలెత్తాయి. అద్దంకి వేమారెడ్డి పై సింగమ యుద్ధము ప్రకటించగా ముసునూరి కాపానీడు వేమారెడ్డికి సాయమందిస్తాడు. జల్లిపల్లి వద్ద క్షత్రియులతో జరిగిన యుద్ధములో సింగమ చంపబడతాడు. ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు జల్లిపల్లిపై దాడి చేసి క్షత్రియులందరినీ సంహరించి ప్రతీకారము తీర్చుకుంటారు. పిమ్మట బహమనీలతో చేయి కలిపి 1369లో ఓరుగంటిపై దండెత్తి, తెలంగాణమునకు అధిపతులయ్యారు. కాని అతి త్వరలో బహమనీల అధికారమునకు లోబడక తప్పలేదు.
ముసునూరి కాపానీడు మరణము తరువాత అనవోత, మాదా నాయకులు రాచకొండను, దేవరకొండను తమలోతాము పంచుకొంటారు. దేవరకొండకు మాదా నాయకుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యమును ఎనిమిది మంది రాజులు క్రీ. శ. 1287 నుండి 1475 వరకు క్రమముగా పాలించారు.
వ్యాసం: బొబ్బిలి యుద్ధము