వెల్లయాని సరస్సు | |
---|---|
![]() | |
ప్రదేశం | తిరువనంతపురం, కేరళ |
అక్షాంశ,రేఖాంశాలు | 8°24′N 76°59′E / 8.400°N 76.983°E |
ప్రవహించే దేశాలు | India |
ప్రాంతాలు | తిరువనంతపురం |
వెల్లయాని సరస్సు భారతదేశంలోని కేరళలో గల తిరువనంతపురం జిల్లాలో ఉన్న ఒకపెద్ద మంచినీటి సరస్సు.[1]
ఈ సరస్సు తిరువనంతపురం సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 9 కి.మీ దూరంలో తంపనూరు వద్ద ఉంది. ఈస్ట్ ఫోర్ట్ సిటీ డిపో నుండి వెల్లయాని సరస్సుకి బస్సులు తిరుగుతాయి. ఇది కోవలం నుండి పూంకుళం జంక్షన్ మీదుగా 7 కి.మీ దూరంలో ఉంది.
ఈ సరస్సు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రజలు ఈ అద్భుతమైన మంచినీటి సరస్సుని చూసే అవకాశాన్ని కోల్పోకూడదని దాని మీద వంతెనను నిర్మించారు. ఈ వంతెన మీద ప్రశాంతమైన వాతావరణాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఇది వెన్నెల రాత్రులలో చాలా ప్రశాంతమైన వాతావరణంను అందిస్తుంది.
ఈ సరస్సుకు దగ్గరలో వవ్వమూల అనే మరొక మంచినీటి సరస్సు ఉంది.
ప్రతి సంవత్సరం జరిగే ఓనమ్ పండగ సందర్భంగా సరస్సులో పడవ పోటీలు నిర్వహిస్తారు. ఇది అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తుంది. కోవలం బీచ్ నుండి సరస్సును చేరుకోవడానికి కంట్రీ బోట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
సరస్సును పూడ్చడానికి, పునరుద్ధరించబడిన ప్రాంతాన్ని వ్యవసాయం కోసం ఉపయోగించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ దీనిని స్థానికులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించి, అడ్డుకున్నారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, కాలుష్యం, భూ ఆక్రమణలు వంటి వాటి వలన ఈ సరస్సును ప్రేమించేవారు కొంత ఆందోళన చెందుతున్నారు.[2]