వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | యాస్తికా భాటియా |
జట్టు సమాచారం | |
చరిత్ర | |
IZODC విజయాలు | 0 |
IZ3D విజయాలు | 0 |
IZT20 విజయాలు | 0 |
IZOD విజయాలు | 0 |
వెస్ట్ జోన్ (పశ్చిమ మండల) మహిళల క్రికెట్ జట్టు పశ్చిమ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించుతుంది. ఇది మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ (అంతర మండల ఒక రోజు) వన్ డే, T20 లలో పశ్చిమ భారత దేశానికి ప్రాతినిధ్యం వహింస్తుంది. పశ్చిమ మండల మహిళల క్రికెట్ జట్టు 5 జట్ల ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టు. అవి- బరోడా, గుజరాత్, మహారాష్ట్ర, ముంబై, సౌరాష్ట్ర. ఈ జట్టును 1974-75లో రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి ఏర్పాటు చేసారు. ఈ పోటీలు ముగిసే వరకు అంటే 2002-03 వరకు ఆడారు. తర్వాత వన్ డే పోటీ లలో పాల్గొన్నారు, ఆపై మూడు రోజుల పోటీలో రన్నరప్‌గా 2వ స్థానంలో నిలిచారు.[1]
వెస్ట్ జోన్ మహిళల జట్టు మొదటిసారిగా రాణి ఝాన్సీ ట్రోఫీని 1974–75 సీజన్ లిస్ట్ A లో పోటీలో ఆడారు. 2002-03 సీజన్ తర్వాత ట్రోఫీ రద్దు అయ్యే వరకు వారు ఈ టోర్నమెంట్‌లో ఆడారు, అయితే ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు.[2]
2007లో, వెస్ట్ జోన్ జట్టు ఇంటర్ జోన్ మహిళల వన్ డే పోటీలలో ఆడటం ప్రారంభించింది, 2006-07, 2013-14 సీజన్ లు ముగిసే వరకు ఆడి 2007–08, 2008–09, 2010–11లలో మూడుసార్లు ఈ పోటీలలో రన్నరప్‌గా నిలిచారు.[3][4][5]
2014–15 సీజన్‌లో, పశ్చిమ మండల జట్లు మహిళల రెండు రోజుల పోటీలో పాల్గొన్నాయి. తొలి సీజన్‌లో వెస్ట్ జోన్ జట్టు 4 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.[6] ఈ సీజన్ 2015–16, టోర్నమెంట్ మూడు రోజుల పోటీగా మారిన తర్వాత 5 జట్లు పోటీపడగా 4వ స్థానంలో నిలిచింది.[7] 2016–17లో మొదటి ఇన్నింగ్స్‌లో ఒక గెలుపు, ఒక డ్రాతో రెండవ స్థానంలో నిలిచింది.[8] దక్షిణ మండలం (సౌత్ జోన్) పై 109 పరుగుల తేడాతో గెలుపు వారి కిది అతిపెద్ద విజయం.[9] 2017–18లో, అదే దక్షిణ మండలం పై మళ్లీ ఒక మ్యాచ్ గెలిచి మూడో స్థానంలోకి నిలిచింది.[10][11]
2022–23లో T20 రూపంలో భారతదేశంలో జోనల్ క్రికెట్ తిరిగి వచ్చింది.[12] టోర్నమెంట్ మొదటి ఎడిషన్ గ్రూప్ దశలో పశ్చిమ మండల జట్టు, ఆరు జట్లలో రెండవ స్థానంలో నిలిచారు, ఫైనల్ మ్యాచ్లో సెంట్రల్ జోన్‌తో 9 వికెట్ల తేడాతో ఓడిపోయారు.[13] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ వన్ డే టోర్నమెంట్ జరిగింది, దీనిలో వారు గ్రూప్ దశలో ఐదవ స్థానంలో నిలిచారు.[14]
2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ క్యాప్‌లు ఉంటాయి.[15]
పేరు | జాతీయత | దేశీయ జట్టు |
---|---|---|
యష్టికా భాటియా | భారతదేశం | బరోడా |
వృశాలి భగత్ | భారతదేశం | ముంబై |
సానికా చాల్కే | భారతదేశం | ముంబై |
కృతికాబెన్ చౌదరి | భారతదేశం | గుజరాత్ |
రియా చౌదరి | భారతదేశం | ముంబై |
నేహా చావ్దా | భారతదేశం | సౌరాష్ట్ర |
సురేష్ ధరణి | భారతదేశం | సౌరాష్ట్ర |
భావన గోప్లాని | భారతదేశం | గుజరాత్ |
జయశ్రీబా జడేజా | భారతదేశం | సౌరాష్ట్ర |
మృదులా జడేజా | భారతదేశం | సౌరాష్ట్ర |
జాన్వీ కేట్ | భారతదేశం | ముంబై |
హుమైరా కాజీ | భారతదేశం | ముంబై |
ఆర్తి కేదార్ | భారతదేశం | మహారాష్ట్ర |
సయాలీ లోంకర్ | భారతదేశం | మహారాష్ట్ర |
జయ మోహితే | భారతదేశం | బరోడా |
ప్రకాశిక నాయక్ | భారతదేశం | ముంబై |
నాన్సీ పటేల్ | భారతదేశం | బరోడా |
సిమ్రాన్ పటేల్ | భారతదేశం | గుజరాత్ |
తరన్నుమ్ పఠాన్ | భారతదేశం | బరోడా |
జాగ్రవి పవార్ | భారతదేశం | ముంబై |
ఉత్కర్ష పవార్ | భారతదేశం | మహారాష్ట్ర |
శ్రద్ధా పోకర్కర్ | భారతదేశం | మహారాష్ట్ర |
ప్రగ్యా రావత్ | భారతదేశం | బరోడా |
సయాలీ సత్ఘర | భారతదేశం | ముంబై |
సిమ్రాన్ షేక్ | భారతదేశం | ముంబై |
శివాలి షిండే | భారతదేశం | మహారాష్ట్ర |
హిరాల్బెన్ సోలంకి | భారతదేశం | గుజరాత్ |
మాయా సోనవానే | భారతదేశం | మహారాష్ట్ర |
దేవికా వైద్య | భారతదేశం | మహారాష్ట్ర |
ముస్కాన్ వాసవ | భారతదేశం | గుజరాత్ |
బుతువు | లీగ్ స్టాండింగ్‌లు [16] | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | DWF | DLF | ND | BP | Pts | Pos | |
2014–15 | 4 | 0 | 0 | 0 | 1 | 3 | 0 | 4 | 5వ |
2015–16 | 4 | 0 | 0 | 2 | 2 | 0 | 0 | 8 | 4వ |
2016–17 | 4 | 1 | 0 | 1 | 2 | 0 | 1 | 12 | 2వ |
2017–18 | 4 | 1 | 2 | 1 | 0 | 0 | 1 | 10 | 3వ |
సీజన్ | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 4 | 1 | 0 | 0 | +0.370 | 16 | 2వ | ఫైనల్‌లో ఓడిపోయింది |
బుతువు | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 1 | 4 | 0 | 0 | –0.249 | 4 | 5వ |