వేణుగోపాలస్వామి దేవాలయం (కార్వేటినగరం) | |
---|---|
![]() | |
ఆంధ్రప్రదేశ్ లో స్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°21′N 79°25′E / 13.35°N 79.41°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రదేశం | కార్వేటినగరం |
సంస్కృతి | |
దైవం |
|
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ నిర్మాణం |
వేణుగోపాలస్వామి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, కార్వేటినగరంలో ఉన్న ఒక హిందూ-వైష్ణవ దేవాలయం.[1] ఈ దేవాలయం కృష్ణుడికి అంకితం చేయబడింది, దీనిని విష్ణువు దశావతారంలో తొమ్మిదవ అవతారంగా భావిస్తారు, అతన్ని వేణుగోపాలుడు అని పిలుస్తారు.[2] ఇది తిరుపతి[1] నుండి 58 కి.మీ.ల. దూరంలో, పుత్తూరు నుండి 12 కి.మీ.ల దూరంలో ఉంది.[2]
ఈ దేవాలయాన్ని వెంకటరాజ వంశానికి చెందిన రాజు వెంకటపెరుమాళ్ నిర్మించాడు.[1]
ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది.[3] ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో కార్యకలాపాలను నిర్వహించే స్వతంత్ర ట్రస్ట్.
గర్భగృహంలో వేణుగోపాలస్వామి, ఆయన భార్యలు రుక్మిణి, సత్యభామ ప్రధాన దేవత ప్రక్కల కొలువై ఉన్నారు.[1] ఈ విగ్రహాలను నారాయణవనం దేవాలయం[1] నుండి తీసుకువచ్చారు. సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మతోపాటు రాముడికి అంకితం చేయబడిన ఉపాలయాలు ఉన్నాయి. దేవాలయ చెరువును స్కంద పుష్కరిణి అని పిలుస్తారు.[2]
దేవాలయంలో వైకానస ఆగమ ప్రకారం నిత్య పూజలు జరుగుతాయి. కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, సంక్రాంతి పండుగలు జరుగుతాయి.[2][3]
18వ శతాబ్దపు తొలినాళ్లలో తెలుగు కవి అయిన సారంగపాణి, ఈ దేవాలయ వేణుగోపాల స్వామిని స్తుతిస్తూ పద సంప్రదాయంలో అనేక పాటలు రాశారు. ఆయన రాసిన దాదాపు 200 పాటలు నేటికీ ముద్రణ రూపంలో ఉన్నాయి.[4]