వైద్యేశ్వరన్ రాజారామన్ (జననం: సెప్టెంబరు 8, 1933) ఈయన భారతీయ ఇంజనీర్, విద్యావేత్త, రచయిత. ఈయన భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ విద్యా రంగంలో పేరు గాంచిన వ్యక్తి. ఈయన పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1]
ఈయన 1933, సెప్టెంబరు 8 న రామస్వామి వైద్యేశ్వరన్, శారద దంపతులకు మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌లో జన్మించాడు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ కళాశాల నుండి భౌతిక శాస్త్రం లో పూర్తి చేశాడు. 1955 లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) విశ్వద్యాలయంలో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసాడు. 1957 లో IISc సహకారంతో అనలాగ్ కంప్యూటర్ కోసం నాన్-లీనియర్ యూనిట్లను రూపకల్పన చేసాడు. ఈయన 1959లో భారత ప్రభుత్వం విదేశీ స్కాలర్‌షిప్ సహకారంతో కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేసాడు. ఈయన తన డాక్టరల్ అధ్యయనాల కోసం విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో చేరి అనుకూల నియంత్రణ వ్యవస్థలపై పరిశోధనలు చేసి 1961 లో పిహెచ్‌డి పట్టాను పొందాడు. ఆ తరువాత విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో గణాంకాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 1962 లో కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటికె) లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. 1965-66 మధ్య కాలంలో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి వెళ్ళాడు. భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొట్టమొదటి అకాడెమిక్ ప్రోగ్రాంను స్థాపించింది ఈయనే. ఈ ప్రోగ్రాంని 1965 లో కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రారంభించడానికి సహాయపడింది. ఈయన 1974 లో ఐఐటికెలో సీనియర్ ప్రొఫెసర్ గా ఉండి 1982 వరకు అక్కడే పనిచేశాడు. ఈయన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు వెళ్లి తక్కువ ఖర్చుతో కూడిన సమాంతర కంప్యూటర్లను, సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన IITK, IISc ప్రొఫెసర్ గా ఉన్నత కాలం 30 మంది విద్యార్థులను వారి డాక్టరల్ అధ్యయనాలలో మార్గనిర్దేశం చేశాడు. ఈయన జాతీయ, అంతర్జాతీయ పీర్-రివ్యూ జర్నల్స్, 23 టెక్స్ట్ బుక్స్‌లో 70 కి పైగా శాస్త్రీయ పత్రాలను ప్రచురించాడు. భారతదేశంలో ప్రచురించబడిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో మొదటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ ఫోర్ట్రాన్ 90, 95 కంప్యూటర్ ఓరియంటెడ్ న్యూమరికల్ మెథడ్స్, 3 వ ఎడిషన్, అనలాగ్ కంప్యూటేషన్ అండ్ సిమ్యులేషన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ యొక్క విశ్లేషణ, రూపకల్పన, 3 వ ఎడిషన్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ సి ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ ఫోర్ట్రాన్ 77 (ఫోర్ట్రాన్ 90 కి పరిచయంతో), 4 వ ఎడిషన్ ఇ-కామర్స్ టెక్నాలజీ యొక్క ఎస్సెన్షియల్స్, ఇంట్రడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 వ ఎడిషన్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, 6 వ ఎడిషన్, సమాంతర కంప్యూటర్లు - ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామింగ్, 2 వ ఎడిషన్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఇంట్రడక్షన్ టు డిజిటల్ కంప్యూటర్ డిజైన్, ఆన్, 5 వ ఎడిషన్, కంప్యూటర్ల యొక్క ప్రాథమిక అంశాల వంటి వాటి గురించి ప్రచురించాడు.[2]
ఈయనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి, ఓం ప్రకాష్ భాసిన్ అవార్డు, హోమి భాభా బహుమతి లాంటి అనేక గౌరవాలను పొందాడు.[3] ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చేసిన కృషికి భారత ప్రభుత్వం 1998 లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.[4]