వైశాలి కాసరవల్లి | |
---|---|
![]() | |
జననం | |
మరణం | 2010 సెప్టెంబరు 27 | (వయసు: 58)
జీవిత భాగస్వామి | |
పిల్లలు | అపూర్వ (కుమారుడు) అనన్య (కుమార్తె) |
వైశాలి కాసరవల్లి (1952, ఏప్రిల్ 12 – 2010, సెప్టెంబరు 27) కర్ణాటకకు చెందిన సినిమా నటి, టెలివిజన్ సీరియల్ దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్.[1] 1997లో తాయ్ సాహెబ్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
వైశాలి 1952, ఏప్రిల్ 12న నాటకరంగ ప్రముఖులైన డాక్టర్ చితాగోపి - నిర్మల దంపతులకు కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించింది. బీఏ చదువు పూర్తిచేసింది.[2]
బివి కారంత్ రూపొందించిన నాటకం ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టింది. తన కుటుంబం బెంగుళూరుకు వలస వెళ్ళిన హయవదన, జోకుమారస్వామి, మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, నాటకాకార ష్ధనేయల్లి ఆరు పత్రాలు, అనేక ఇతర నాటకాలలో నటించింది. సేవంతి ప్రసంగ అనే నాటకానికి దర్శకత్వం వహించింది. మరాఠీ, హిందీ నుండి అనేక క్లాసిక్ రచనలను కన్నడ భాషలోకి అనువదించింది.
1972లో వచ్చిన యావ జన్మద మైత్రి అనే సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. 1974లో ప్రొఫెసర్ హుచూరయ్య సినిమాలో నటించింది. ఆ తరువాత అక్రమ, యరిగు హెల్బేడి, కిట్టు పుట్టు, కుబి మత్తు ఇయాల, అంగయిల్లి అప్సరే, క్రౌర్య, హోంబిసిలు, స్వామి, తబరన కథే, క్షీర సాగర, అనుకోలకోబ గండ, ఆసెగొబ మీసెగొబ్బ, మూరు చంద్రాస దారీగలు, మహాదాస, బస్సా దారీగలు, మహాదాస, బస్సొదారి పాన్ హూవొందు బేకు బల్లిగే, విఘ్నేశ్వరన వాహనం, శంకర్ గురు, పాలితంశ, పరివర్తన, స్పర్శ, నిగత, గణేశన మదువే, గౌరీ గణేశ, తవరుమనే ఉడుగోరే, నం 73 శాంతినివాస వంటి జనాదరణ పొందిన సినిమాలలో నటించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన అక్రమణలో ప్రధాన పాత్రలో నటించి ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా గెలుచుకుంది.
టిఎస్ నాగభరణ దర్శకత్వం వహించిన నమ్మ నమ్మి అనే సీరియల్‌లో తొలిసారిగా నటించింది. నమ్మ నమ్మల్లి, కాస ముసురే సరోజ, మాల్గుడి డేస్, క్షమయ దరిత్రి, మాయామృగ, మన్వంతర, సాధనే సహా అనేక టెలి-సీరియల్స్‌లో కూడా వైశాలి నటించింది.[3]
'ముత్తిన తోరణ', 'మూడలా మనే' అనే ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్ కి దర్శకత్వం వహించింది.
తన భర్త గీరీష్ కాసరవల్లి తీసిన బన్నాడ వేష, మనే, కుబి మత్తు ఇయ్యాల, క్రౌర్య, తాయ్ సాహెబ్ (1998లో జాతీయ అవార్డు గెలుచుకుంది), ద్వీప, కనసెంబ కుదురయనేరి వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.
వైశాలి పలు సన్మానాలు అందుకున్నారు
90వ దశకం చివరిలో రాజకీయాల్లోకి వచ్చిన వైశాలి, 1996లో బెంగుళూరు సిటీ కార్పొరేషన్ ఎన్నికలకు లోక్ శక్తి పార్టీ నుండి పోటీచేసి ఓడిపోయింది.
వైశాలి ప్రముఖ సినీ నిర్మాత గిరీష్ కాసరవల్లిని వివాహం చేసుకున్నది. వారికి ఒక కుమారుడు (అపూర్వ కాసరవల్లి), ఒక కుమార్తె (అనన్య కాసరవల్లి) ఉన్నారు.
మధుమేహం, కాలేయం, మూత్రపిండాల సమస్యలతో 2010, సెప్టెంబరు 27న బెంగళూరులో మరణించింది.[1]