శంకర | |
---|---|
దర్శకత్వం | తాతినేని సత్య |
నిర్మాత | ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ |
తారాగణం | నారా రోహిత్, రెజీనా |
ఛాయాగ్రహణం | టి. సురేందర్ రెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లీల మూవీస్ |
విడుదల తేదీ | 21 అక్టోబరు 2016[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శంకర 2016, అక్టోబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, రెజీనా, ఆహుతి ప్రసాద్, ఎం. ఎస్. నారాయణ, రాజీవ్ కనకాల, ప్రగతి తదితరులు నటించగా సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[2][3] తమిళంలో విజయం సాధించిన మౌన గురు చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది.[4][5]
శంకర్ (నారా రోహిత్) హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి (జాన్ విజయ్) వల్ల శంకర్) మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కుంటాడు. శంకర్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది మిగతా కథ.
సాయి కార్తీకం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఓ శరభ (రచన: అభినయ శ్రీనివాస్)" | సాయి కార్తీక్, దివిజ కార్తీక్ | 1:32 | ||||||
2. | "నీ ప్రాణం (రచన: బాలాజీ)" | రంజిత్ | 4:12 | ||||||
3. | "మరదల మరదల (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సాయి కార్తీక్, దివిజ కార్తీక్ | 3:25 | ||||||
4. | "శంకర (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సాయి చరణ్, ఎం.ఎల్.ఆర్. కార్తీకేయన్ | 3:12 | ||||||
5. | "ఎదలోన (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సమీర్ | 3:54 | ||||||
16:15 |