శకుంతల దే | |
---|---|
దర్శకత్వం | అను మేనన్ |
స్క్రీన్ ప్లే | అను మేనన్ నయనికా మహ్తాని |
దీనిపై ఆధారితం | శకుంతలా దేవి |
నిర్మాత | సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్, విక్రమ్ మల్హోత్రా |
తారాగణం | విద్యా బాలన్, జిషు సేన్ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్ సాధి |
ఛాయాగ్రహణం | కియోకి నకర |
కూర్పు | A అంతరా లహ్రి |
సంగీతం | నేపధ్య సంగీతం: కరణ్ కులకర్ణిi పాటలు: సచిన్ జిగార్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ |
విడుదల తేదీ | 31 జూలై 2020 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
శకుంతల దేవి 2020లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి అను మేనన్ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, జిషు సేన్ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్ సాధి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ను జులై 15న,[1] సినిమాను 31 జులై 2020న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.[2]
శకుంతలాదేవి (విద్యా బాలన్) తండ్రి బిషా మిత్ర మణి (ప్రకాష్ బెళవాడి) శిక్షణలో గణిత మేధావిగా ఎదుగుతుంది. దీంతో విదేశాలకు వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శకుంతల దేవి పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్తా) ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌ని పెళ్లి చేసుకొని అను (సాన్యా మల్హోత్రా) కు జన్మనిస్తుంది. ఆమె వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొంది?? భర్త , కూతురు ఆమెకు ఎందుకు దూరమవుతారు?? మళ్ళీ వారు కలిసారా లేదా అనేదే మిగతా సినిమా కథ.[3][4]