శక్తిశ్రీ గోపాలన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | కొచ్చి, కేరళ, భారతదేశం | 1987 అక్టోబరు 25
సంగీత శైలి | పాప్ సంగీతం, జజ్, నేపధ్యగాయని, హిందూస్థానీ సంగీతం |
వృత్తి | గాయని, పాటల రచయిత్రి |
వాయిద్యాలు | గాత్ర సంగీతం |
క్రియాశీల కాలం | 2008–ప్రస్తుతం |
సంబంధిత చర్యలు | Off The Record Pyjama Conspiracy |
శక్తిశ్రీ గోపాలన్ (జ.1987 అక్టోబరు 25) భారతీయ రచయిత్రి, పాటల రచయిత్రి, నటి. ఆమె ఎ.ఆర్.రెహమాన్ వంటి అగ్ర-భారత సంగీత దర్శకులు / స్వరకర్తలతో కలసి ఎన్నో పాటలకు పని చేసింది.[1] చలన చిత్ర సంగీతం పక్కన పెడితే, ఆమె స్వతంత్ర సంగీత సన్నివేశంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. పాప్, రిథం అండ్ బ్లూస్, ట్రిప్-హాప్ జాజ్ వంటి సంగీత కార్యక్రమాలలో వివిధ బృందాలతో ప్రదర్శన ఇచ్చింది.[2][3] ఆమె చలన చిత్ర స్ంగీత పరిశ్రమలో విజయాలతో పాటు బహుళ భాషలలో స్వతంత్రంగా సంగీతాన్ని ప్రదర్శిస్తోంది. ఆల్బం లను విడుదల చేస్తోంది. ఆమె వృత్తిరీత్యా వాస్తుశిల్పి. ఆమె స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నుండి పట్టభద్రురాలైంది.
శక్తిశ్రీ గోపాలన్ కేరళలోని కొచ్చిలో పుట్టి పెరిగింది. ఆమె పాఠశాల విద్యను కలమసేరిలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేసింది. తర్వాత చెన్నై కి వెళ్లి అన్నా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో ఆర్కిటెక్చర్ డిగ్రీని అభ్యసించింది.[4]
ఆమె 13 సంవత్సరాలు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. ఆమె 11 వ తరగతి చదువుతున్న సమయంలో ఎస్ఎస్ మ్యూజిక్ వాయిస్ హంట్ 1 ను నిర్వహించింది. ఆమెకు 18 ఏళ్లలోపు వయసు ఉన్నందున అది ఆడిషన్స్‌తో ముగిసింది. చివరికి 2008 లో ఆమె ఎస్ఎస్ మ్యూజిక్ వాయిస్ హంట్ యొక్క రెండవ సీజన్‌ను గెలుచుకుంది. ఆమె మొదటిసారి నవంబర్ 2008 లో ఆడిషన్ చేయబడింది. టాక్సీ 4777 చిత్రం కోసం తన తొలి పాటను పాడే అవకాశం లభించింది.[5][6]
13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికే ఆమె కర్ణాటక సంగీతం, రాక్ సంగీతంలో శిక్షణ పొందింది. 2008 సంవత్సరంలో "ఎస్ఎస్ మ్యూజిక్ వాయిస్ హంట్" టైటిల్ గెలుచుకున్న తరువాత, గోపాలన్ అదే సంవత్సరంలో సినిమా నేపధ్య గాయనిగా అడుగుపెట్టింది. చెన్నై లైవ్స్ బ్యాండ్ హంట్ లో ఆమె మూడవ స్థానంలో నిలిచింది.