శభాష్ మిథు | |
---|---|
దర్శకత్వం | శ్రీజిత్ ముఖర్జీ |
రచన | ప్రియా అవెన్ |
తారాగణం | తాప్సీ |
ఛాయాగ్రహణం | శీర్ష రే |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | అమిత్ త్రివేది |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 15 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
శభాష్ మిథు స్పోర్ట్స్ డ్రామాగా నిర్మించిన హిందీ సినిమా. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ జీవిత కథ ఆధారంగా వయాకామ్ 18 స్టూడియోస్, కాళోస్కీయం మీడియా బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 20న విడుదల చేసి[1] సినిమాను జూలై 15న విడుదల చేయనున్నారు.[2]
మిథాలీ రాజ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు మాజీ టెస్ట్, వన్డే కెప్టెన్. ఆమె 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశ క్రికెట్ జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్ళింది. మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహిళా క్రికెట్ ప్రపంచంలో మిథాలీ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలను చూపిస్తుంది.
ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం సమకుర్చాడు. స్వానంద్ కిర్కిరే, కౌసర్ మునీర్, చరణ్, రాఘవ్ ఎం కుమార్ పాటలు రాశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ కంపోజ్ చేసింది.
డిసెంబరు 3న మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, 2022 ఫిబ్రవరి 4న సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించాడు.[5] అదేరోజున రాజ్‌కుమార్ రావు హాస్య చిత్రం బదాయి దోతో విడుదల వల్ల, ఫిబ్రవరి 11కి వాయిదా పడింది.[6] తదనంతరం ఈ చిత్రం విడుదల కాలేదు. 2022 జూలై 15న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది.[7]