శశాంక్ సుబ్రహ్మణ్యం | |
---|---|
జన్మ నామం | శశాంక్ సుబ్రహ్మణ్యం |
జననం | రుద్రపట్న, హసన్‌జిల్లా, కర్ణాటక | 1978 అక్టోబరు 14
సంగీత శైలి | కర్ణాటక సంగీతం భారత శాస్త్రీయ సంగీతం |
వృత్తి | సంగీత విద్వాంసుడు, వాద్య కళాకారుడు |
వాయిద్యాలు | వేణువు |
క్రియాశీల కాలం | 1984–ప్రస్తుతం |
శశాంక్ సుబ్రహ్మణ్యం (జ.1978) గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసుడు.[1] ఇతడు తన 6వ యేటనే కచేరీ చేయడం మొదలుపెట్టిన బాలమేధావి.
ఇతడు కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా, రుద్రపట్న గ్రామంలో సుబ్రహ్మణ్యం, హేమలత దంపతులకు 1978, అక్టోబర్ 14న జన్మించాడు. ఇతడు కర్ణాటక సంగీతాన్ని తన తండ్రి వద్ద, ఆర్.కె.శ్రీకంఠన్ వద్ద, పాల్గాట్ కె.వి.నారాయణస్వామి వద్ద, హిందుస్తానీ సంగీతాన్ని పండిట్ జస్రాజ్ వద్ద నేర్చుకున్నాడు.[2] ఇతడు వేణుగానాన్ని ఏ గురువు వద్ద నేర్చుకోలేదు. స్వంతంగా నేర్చుకున్నాడు. ఇతడు భరతనాట్య కళాకారిణి శిరీషను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె స్వర, కుమారుడు సమ్విత్ ఉన్నారు. ఇతడు తన కుటుంబంతో చెన్నైలో నివసిస్తున్నాడు.[3]
ఇతడు తన 6 యేళ్ళ వయసులో 1984లో మొట్టమొదటి కచేరీ చేశాడు. 1990లో ఇతడు ముఖ్యమైన కచేరీలు అడిలాయిడ్, ఆస్ట్రేలియా, కౌలాలంపూర్, మలేసియా, సింగపూర్ మొదలైన చోట్ల నిర్వహించాడు. 1990 డిసెంబరులో శాస్త్రి భవన్‌లో ఇతడు సంగీత ప్రదర్శనను ఇచ్చాడు.[4]మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని 12యేళ్ళ వయసులో 1991 జనవరి 1న "సదస్ కచేరీ"కి ఆహ్వానించింది.
ఇతడు ఎక్కువగా దేశ విదేశ సంగీతకారుల ప్రదర్శనలకు సహకారం అందించాడు. జాన్ మెక్ లాగ్లిన్, పాకో డి లూసియా, షాంక్సి సింఫొనీ ఆర్కెస్ట్రా, న్యూ జంగిల్ ఆర్కెస్ట్రా, మిక్కెల్ నార్డ్సో, టెర్రీ రిలే, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, జాకిర్ హుసేన్, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్, విశ్వమోహన్ భట్, రోను మజుందార్, ఉస్తాద్ షుజాత్ ఖాన్, దేబూ చౌదరి మొదలైన కళాకారులకు వేణు గాన సహకారాన్ని అందించాడు.[5]
ఇతడు సంప్రదాయ భారతీయ సంగీత కచేరీలతో పాటు సింఫనీలు, జాజ్, సినిమాలు ఇతర తరహా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. బి.బి.సి. ఇతని జీవితంపై 2006లో డెస్టినేషన్ మ్యూజిక్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రసారం చేసింది.
ఇతడు వేణునాదంలో అనేక ప్రయోగాలు చేశాడు. ఇతడు 75 సి.డి.లు, 10 డి.వి.డి.లు విడుదల చేశాడు. వాటిలో చారుకేశి, స్పిరిట్ ఆఫ్ కృష్ణ, సుందర, మోహన, బిందుమాలిని, ఉత్సవ్, రాగ లతాంగి, రసాయన, మార్గళి మెలోడీస్ మొదలైనవి ఉన్నాయి.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)