శాంత కుమార్ | |||
| |||
పదవీ కాలం 1977 జూన్ 22 – 1980 ఫిబ్రవరి 14 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
---|---|---|---|
తరువాత | ఠాకూర్ రామ్ లాల్ | ||
పదవీ కాలం 1990 మార్చి 5 – 1992 డిసెంబర్ 15 | |||
ముందు | వీరభద్ర సింగ్ | ||
తరువాత | వీరభద్ర సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1934 సెప్టెంబర్ 12 సిమ్లా హిమాచల్ ప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సంతోష్ శైలజ |
శాంత కుమార్ (జననం 1934 సెప్టెంబరు 12) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. శాంత కుమార్ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1989లో శాంత కుమార్ కాంగ్రా నియోజకవర్గం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. శాంత కుమార్ అదే నియోజకవర్గం నుంచి 1998, 1999, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. శాంత కుమార్ ఎన్నో పుస్తకాలు రచించారు.
శాంత కుమార్ 1934 సెప్టెంబరు 12న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జగన్నాథ్ శర్మ కౌశల్యా దేవి దంపతులకు జన్మించాడు.[1]
1963లో గార్జాముల గ్రామపంచాయతీలో పంచాయితీగా సర్పంచ్ గా ఎన్నికవ్వడం ద్వారా శాంత కుమార్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. శాంత కుమార్ పంచాయితీ సమితి సభ్యునిగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత 1965 నుండి 1970 వరకు కాంగ్రా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు [2]
1972లో శాంత కుమార్ హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1985 వరకు శాంత కుమార్ శాసన సభ్యునిగా కొనసాగారు. 1990లో శాసనసభకు మరోసారి ఎన్నికై 1992 వరకు కొనసాగారు. శాంత కుమార్ 1977లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు.[3] శాంత కుమార్ 1980 వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. 1990లో మళ్లీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1992 వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[4] ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగులు సమ్మె చేశారు. దీంతో శాంత కుమార్ ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండడానికి నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేశారు. శాంత కుమార్ 1980 నుండి 1985 వరకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు [5]
1989లో శాంత కుమార్ కాంగ్రా నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. శాంత కుమార్ 1998 1999లో రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యాడు. శాంత కుమార్ 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు [3] శాంత కుమార్ 1999 నుండి 2002 వరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజాపంపిణీ మంత్రిగా పనిచేశాడు. 2002 నుండి 2004 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు [3][5]
శాంత కుమార్ 2008లో హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు [6] 2014లో శాంత కుమార్ కాంగ్రా నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[7]
శాంత కుమార్ పుస్తకాలలో కింది పుస్తకాలను రచించాడు:[8]