శాంతం | |
---|---|
దర్శకత్వం | జయరాజ్ |
రచన | పి. సురేష్ కుమార్ మాడంబు కుంజుకుట్టన్ |
నిర్మాత | పివి గంగాధరన్ |
తారాగణం | సీమా బిస్వాస్ కెపిఎసి లలిత ఐఎం విజయన్ |
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | ఎన్.పి. సతీష్ |
సంగీతం | కైతాప్రమ్ దామోదరన్ నంబూదిరి, రాజమణి |
విడుదల తేదీ | 2001 |
సినిమా నిడివి | 95 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
శాంతం, 2001లో విడుదలైన మలయాళ సినిమా.[1] పివి గంగాధరన్ నిర్మాణంలో జయరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐఎం విజయన్ (భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు), ఎంజి శశి, సీమా బిస్వాస్, కెపిఎసి లలిత, కలమండలం గోపి (కథకళి కళాకారుడు), మాడంబు కుంజుకుట్టన్ (మలయాళ రచయిత) తదితరులు నటించారు.[2][3] 2001లో జరిగిన 48వ జాతీయ చలన చిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అవార్డు, ఉత్తమ సహాయ నటి (కెపిఎసి లలిత) అవార్డును గెలుచుకుంది.[4] దర్శకుడు జయరాజ్ కు ఇది మూడవ జాతీయ అవార్డు. 1996లో 'దేశదానం' ఉత్తమ మలయాళ చిత్రంగా, 1997లో జాతీయ ఉత్తమ దర్శకుడా అవార్డులు వచ్చాయి.