శాంతి కృష్ణ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు |
|
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
బంధువులు | సురేష్ కృష్ణ (సోదరుడు) |
శాంతి కృష్ణ (జననం 1964 జనవరి 2) భారతీయ సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాలలో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 1980లు, 1990లలో ఆమె ఉత్తమ నటిగా వెలుగొందింది. చకోరం (1994)లో శారదమ్మినిగా ఆమె నటనకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం వరించింది. ఆమె పునరాగమన చిత్రం నిజందుకలుడే నత్తిల్ ఒరిడవేలాలో తన నటనకు వరుసగా మూడుసార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు, ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మలయాళం లతో తో సహా అనేక పురస్కారాలు ఆమె గెలుచుకుంది.
1998లో వినీత్, సాక్షి శివానంద్ జంటగా వచ్చిన తెలుగు చిత్రం ప్రియురాలులో కూడా ఆమె నటించింది.
ఆమె తల్లిదండ్రులు ఆర్. కృష్ణ, కె. శారదలది ముంబైలో స్థిరపడిన పాలక్కాడ్ అయ్యర్ కుటుంబం. ఆమె ఎస్.ఐ.ఈ.ఎస్ కాలేజ్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీలో తన విద్యను పూర్తి చేసింది. ఆమెకు ముగ్గురు సోదరులు శ్రీరామ్, సతీష్, చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ.[1][2]
ఆమె తమిళ చిత్రం పనీర్ పుష్పంగళ్‌తో అరంగేట్రం చేసింది.[3] ఆమె తన మొదటి వివాహం తర్వాత చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది, కానీ 1991లో నయం వ్యక్తమక్కున్ను చిత్రంతో తిరిగి వచ్చింది.[4] చకోరం (1994)లో ఆమె నటనకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[5] ఆమె మలయాళ చలనచిత్ర అవార్డులలో జ్యూరీ మెంబర్‌గా పనిచేసింది.[6] ఆమె 2017లో నందుకలుడే నత్తిల్ ఒరిదవేలా చిత్రంతో రెండవ పునరాగమనం చేసింది.
శాంతి కృష్ణ మలయాళ నటుడు శ్రీనాథ్‌ను 1984లో వివాహం చేసుకుంది. వారు 1995లో విడాకులు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌కు కార్యదర్శి సదాశివన్ బజోర్‌ను 1998లో తిరిగి వివాహం చేసుకుంది.[7] వీరికి మిథుల్, మిథాలీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు.[8][9] ఆ తరువాత, ఆమె కొంతకాలం అమెరికాలో ఉండి, ఆ తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చింది.[1]