శిల్పా రైజాదా | |
---|---|
జననం | శిల్పా రైజాదా 1990 జూలై 12 పాఠఖేరా, బేతుల్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | టెలివిజన్ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–2021 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హమారీ దేవ్ రాణి, వీర్ శివాజీ, కృష్ణాబెన్ ఖఖ్రావాలా, జోధా అక్బర్, డిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై: |
శిల్పా రైజాదా (జననం 1990 జూలై 12) ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] ఆమె స్టార్ ప్లస్ ప్రసారం చేసిన హమారి దేవరానీలో పద్మిని పాత్రతో పాటు, కలర్స్ టీవీ వీర్ శివాజీలో బేగం రుఖ్సార్, జీ టీవీ జోధా అక్బర్ లో షెహ్నాజ్, & టీవీ ఢిల్లీ వాలీ ఠాకూర్ గుర్ల్స్ లో బిన్నీ పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[2][3] ఆమె 2016 నుండి 2021 వరకు స్టార్ ప్లస్ లో వచ్చిన యే రిష్టా క్యా కెహ్లతా హై ధారావాహికలో సురేఖా అఖిలేష్ గోయెంకా గా మెప్పించింది.[4]
శిల్పా రైజాదా 1990 జూలై 12న భారతదేశంలోని మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా పాఠక్హరాలో జన్మించింది.[5] ఆమె పాఠక్హరాలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె భోపాల్ లోని, ఎంవిఎం కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. భోపాల్ లో ఆమె ఆజ్ తక్ న్యూస్ ఛానెల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రజలపై అభివృద్ధి కథనాలను కవర్ చేసింది. భోపాల్ లో ఆమె తన తొలి షో హమారి దేవరాని కోసం ఆడిషన్ చేసి ఎంపికయ్యింది. ఆమెకు అక్క సుమన్ రైజాదా, ఇద్దరు సోదరులు సౌమిత్ర, సిద్ధార్థ్ రైజాదా ఉన్నారు.
ఆమె స్టార్ ప్లస్ రోజువారీ సోప్ మధ్యాహ్నం షో హమారి దేవరానీతో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె నెగటివ్ ప్రధాన పాత్రకు నామినేట్ చేయబడింది. ఈ షో తరువాత ఆమె మాతా కీ చౌకీలో సీతగా, జోధా అక్బర్ షెహ్నాజ్ గా, ఢిల్లీ వలీ ఠాకూర్ గుర్ల్స్ లో బిన్నీగా.. ఇలా పలు పాత్రలు పోషిస్తూ బిజీగా ఉండిపోయింది. ఆమె చివరిసారిగా 2016 నుండి 2021 వరకు యే రిష్టా క్యా కెహ్లతా హై లో సురేఖా అఖిలేష్ గోయెంకా గా కనిపించింది.[6][7] 2023లో ఆమె రావణ పాత్ర పోషిస్తున్న పునీత్ ఇస్సార్, హనుమాన్ పాత్ర పోషిస్తున్న విందూ దారా సింగ్, సిద్ధాంత్ ఇస్సార్ పోషిస్తున్న రామ్ లతో సీతగా చేస్తోంది, ఇది ఒక ప్రత్యక్ష థియేటర్.
సంవత్సరం | సీరియల్ | పాత్ర | మూలం |
---|---|---|---|
2010 | హమారి దేవరాని | పద్మిని | |
2011 | వీర్ శివాజీ | బేగమ్ రుఖ్సర్ | |
2011 | కృష్ణబెన్ ఖాఖ్రవాలా | బిన్నీ | [8] |
2013 | జోధా అక్బర్ | షెహ్నాజ్ | |
2015 | ఢిల్లీ వాలీ ఠాకూర్ గుర్ల్స్ | బిన్నీ | [9][10] |
కిల్లర్ కరోకే అట్కా తో లట్కా | తానే | [11] | |
2016–2021 | యే రిష్టా క్యా కెహ్లతా హై | సురేఖా అఖిలేష్ గోయెంకా | [12] [13] |